Jagapathi Babu: ఇండస్ట్రీలో నాకున్న జన్యున్ ఫ్రెండ్ అతనొక్కడే.. ఆసక్తికర విషయం చెప్పిన జగపతి బాబు
ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన జగపతి బాబు ఇప్పుడు విలన్ గా అదరగొడుతున్నారు. అప్పట్లో ఫ్యామిలీ హీరో అనే క్రేజ్ ను సొంతం చేసుకున్న జగపతి బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో
Jagapathi Babu: ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన జగపతి బాబు ఇప్పుడు విలన్ గా అదరగొడుతున్నారు. అప్పట్లో ఫ్యామిలీ హీరో అనే క్రేజ్ ను సొంతం చేసుకున్న జగపతి బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఆతర్వాత ఆయన సినిమాలు తగ్గిచారు. తిరిగి నందమూరి బాలకృష్ణ హీగా బోయపాటి శ్రీను తెరకెక్కిన లెజెండ్ సినిమాతో విలన్ గా మారి ఆకట్టుకున్నారు. లెజెండ్ సినిమా తర్వాత జగపతి బాబు కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ఆతర్వాత ఆయన వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ప్రస్తుతం జగపతి బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడొస్తున్న సినిమాల్లో దాదాపు చాలా సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. ఇక జగపతి బాబు ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అని అందరికి తెలుసు తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన దర్శకుడు వర్మ గురించి ప్రస్తావించారు.
జగపతి బాబు మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ ఒక తిక్కలోడు.. నేను కూడా తిక్కలోడినే.. గాయం సినిమా సమయంలో వర్మ దగ్గారకు వెళ్లి నాకు .. ఊర్మిళకు మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావడం లేదని చెప్పాను. ఆయన వెంటనే ఊర్మిళ దగ్గరకు వెళ్లి నువ్వంటే జగపతి బాబుకు ఇష్టం లేదు అని చెప్పేశారు. తాను వచ్చి నన్ను అడిగేసింది ఎందుకు నేను మీకు నచ్చలేదు అని. ఆ తర్వాత ఊర్మిళ అంటే ఇష్టం అని చెబితేనే సినిమా పూర్తి చేస్తా అని వర్మ అన్నడు. అప్పుడు నేను నువ్వంటే నాకు ఇష్టం లేదు.. ఊర్మిళ అంటే కూడా నాకు ఇష్టం లేదు.. నీకు శ్రీదేవి ఇష్టం కాబాట్టి నాకు శ్రీదేవి అన్న ఇష్టం లేదు అని చెప్పేశా.. దాని ఆయన ఇది నాకు నచ్చింది. అని అన్నారు. ఉన్నదున్నట్టుగా చెప్పినప్పుడు అది నచ్చిందని ఆయన అంటుంటాడు అని జగపతి బాబు తెలిపారు. అలాగే తనకు సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్ అని చెప్పాడని పెద్దగా ఎవ్వరు లేరని… కానీ ఇండస్ట్రీలో నాకు జన్యున్ ఫ్రెండ్ అర్జున్ అని అన్నారు జగపతి బాబు.
మరిన్ని ఇక్కడ చదవండి :