Namrata Shirodkar : అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అంటున్న మహేష్ సతీమణి.. వైరల్ అవుతున్న పోస్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత గురించి అందరికి తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ఆమె మహేష్ పెళ్ళాడి సినిమాలకు దూరమయ్యారు.

Namrata Shirodkar : అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అంటున్న మహేష్ సతీమణి.. వైరల్ అవుతున్న పోస్ట్
Mahesh Babu , Namratha , Goutham
Follow us

|

Updated on: Jan 25, 2022 | 10:08 AM

Namrata Shirodkar : సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత గురించి అందరికి తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ఆమె మహేష్ ను పెళ్ళాడిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పారు. మాహేష్ తో వివాహం అనంతరం తన పూర్తి సమయాన్ని భర్త పిల్లలను చూసుకోవడానికి, మహేష్ వ్యాపార భాద్యతలు చూసుకోవడంతో గడుపుతున్నారు నమ్రత. ఇక  నమ్రత సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక తమ కుటుంబం వెకేషన్స్ కు వెళ్ళిసమయంలో గడిపిన సరదా క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు నమ్రత. ఇటీవలే నమ్రత పుట్టిన రోజు జరిగింది. తన పుట్టిన రోజును కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు నమ్రత. ఈ సందర్భంగా తన పిల్లల ఫోటోను షేర్ చేశారు మహేష్ సతీమణి.

ఈ ఫోటోకి ”ప్రతి రోజు.. పిల్లలతో జాలీగా గడపడం కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు” అంటూ తన ఇద్దరు పిల్లలపై ఉన్నప్రేమను మరోసారి పంచుకున్నారు నమ్రత. ఈ ఫోటో నమ్రత పుట్టిన రోజు వేడుకల్లో తీసిన ర్యాండమ్ పిక్. ఇప్పుడు నమ్రత షేర్ చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. క్షణాల్లో ఈ పోస్ట్ కు లైకులు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇక మహేష్ తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే మహేష్  మోకాలికి సర్జరీ జరిగింది. అలాగే కరోనా బారిన కూడా పడ్డాడు మహేష్. నమ్రత- మహేష్ ఎంతో అన్యున్యంగా ఉంటారూ. వీరి మధ్య ఆప్యాయతలు, అనురాగాలు చూసి అందరు.. లవబుల్ కపుల్, కంప్లీట్ ఫ్యామీలీ, బ్యూటీఫుల్ ఫ్యామిలీ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఆతర్వాత త్రివిక్రమ్, రాజమౌళితో సినిమా చేయనున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut: మన హీరోలను ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ బ్యూటీ.. కానీ హిందీ హీరోలను మాత్రం..

Pragya Jaiswal: సల్మాన్ తో రొమాంటిక్ సాంగ్ చేశా.. ఆయన్ని మొదట ఏం అడిగానంటే.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రగ్య

Ram Gopal Varma: అసాధారణ శక్తికి ఆదిపరాశక్తి తోడైతే.. వాయిస్ ఓవర్ తో అదరగొట్టిన ఆర్జీవీ.. కొండా మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్..