Akhanda Remake: బాల‌య్య అఖండ‌కు బాలీవుడ్‌లో య‌మా క్రేజ్‌.. పోటీ ప‌డుతోన్న ఆ ఇద్ద‌రు స్టార్ హీరోలు..

Akhanda Remake: క‌రోనా కార‌ణంగా మూగ‌బోయిన థియేట‌ర్ల‌లో సింహ గ‌ర్జ‌న చేస్తూ దూసుకొచ్చింది బాల‌కృష్ణ అఖండ సినిమా. బాల‌య్య బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా వ‌సూళ్ల సునామీని సృష్టించింది. ఏకంగా...

Akhanda Remake: బాల‌య్య అఖండ‌కు బాలీవుడ్‌లో య‌మా క్రేజ్‌.. పోటీ ప‌డుతోన్న ఆ ఇద్ద‌రు స్టార్ హీరోలు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 25, 2022 | 11:32 AM

Akhanda Remake: క‌రోనా కార‌ణంగా మూగ‌బోయిన థియేట‌ర్ల‌లో సింహ గ‌ర్జ‌న చేస్తూ దూసుకొచ్చింది బాల‌కృష్ణ అఖండ సినిమా. బాల‌య్య బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా వ‌సూళ్ల సునామీని సృష్టించింది. ఏకంగా రూ. 200 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి సంచ‌న‌ల విజ‌యం సాధించింది. ఇటీవ‌లి కాలంలో థియేట‌ర్ల‌లో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా అఖండ అరుదైన గుర్తింపును ద‌క్కించుకుంది. బోయ‌పాటి మార్క్ డైరెక్ష‌న్‌కు డివోష‌న్ ట‌చ్ తోడ‌వ‌డంతో ఈ సినిమా అటు మాస్ ప్రేక్ష‌కుల‌తో పాటు ఇటు ఫ్యామిటీ ఆడియ‌న్స్‌ను సైతం ఆక‌ట్టుకుంది.

ఇక తెలుగులో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న ఈ సినిమాపై బాలీవుడ్ దృష్టి ప‌డింది. సోష‌ల్ మీడియాలో అఖండ సృష్టించిన సునామీ, దీనికి తోడు ఓటీటీలోనూ అఖండ రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతుండ‌డంతో బాలీవుడ్ మేక‌ర్స్ అఖండ‌ను రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నారు. దీంతో అఖండ‌ను బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌డానికి ఇద్ద‌రు స్టార్ హీరోలు పోటీప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. వీరిలో ఒక‌రు అక్ష‌య్ కుమార్ కాగా, మ‌రొక‌రు అజ‌య్ దేవ‌గణ్‌. వీరిద్ద‌రికి మాస్ హీరోలుగా మంచి క్రేజ్ ఉంది.

బాల‌య్య పాత్ర‌ను వీరిద్ద‌రిలో ఒక‌రు పోషిస్తేనే న్యాయం జ‌రుగుతుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు సైతం అంచ‌నా వేస్తున్నాయి. మ‌రి బాలీవుడ్‌లో అఖండ రీమేక్ ఎప్పుడు మొద‌లవుతుంది.? ఈ ప్రాజెక్ట్‌ను ఎవ‌రు టేక‌ప్ చేస్తారో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: T20 Records: 5000 పరుగులు, 400 వికెట్లు.. టీ20 రికార్డుల్లో తగ్గేదేలే అంటోన్న ఆల్‌రౌండర్..!

Accident: దారుణం.. బిడ్జిపై నుంచి ప‌డ్డ కారు.. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు స‌హా 7గురు వైద్య విద్యార్థుల మృతి.

Human Body: మానవ శరీర నిర్మాణంలో కొన్ని ముఖ్యాంశాలు.. ఆసక్తికర విషయాలు..!

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..