సీతగా సాయి పల్లవి.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఒక్కో పార్ట్‌కు ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్, సౌతిండియన్ న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతారాములుగా నటిస్తోన్న సినిమా రామాయణ. దంగల్ ఫేమ్ నితీశ్ తివారీ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియన్ మైథలాజికల్ మూవీలో కన్నడ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక సాయి పల్లవి. గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యతనిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తన సహజమైన నటన, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ఇప్పుడు ఈ నేచురల్ బ్యూటీ బాలీవుడ్‌లోనూ భారీ ప్రాజెక్టులో భాగమైంది. దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’లో సీతమ్మ పాత్రను పోషిస్తోంది. అయితే ఈ సినిమా కోసం సాయి పల్లవి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతాదేవి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్‌తో ఆమె పాత్రపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా, రావణుడిగా కన్నడ స్టార్ యశ్ కనిపించనున్నాడు. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు.
భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం సాయి పల్లవి తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజా మీడియా కథనాల ప్రకారం.. రెండు భాగాలకు కలిపి ఆమెకు సుమారు రూ.12 కోట్ల పారితోషికం అందుతున్నట్లు సమాచారం. అంటే ఒక్కో భాగానికి దాదాపు రూ.6 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాయి పల్లవి పారితోషికంపై సోషల్ మీడియాలో, బాలీవుడ్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే చిత్ర నిర్మాతలు కానీ, సాయి పల్లవి కానీ ఇప్పటివరకు ఈ రెమ్యునరేషన్ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.
గ్లామర్ పాత్రల కంటే కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంది. ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన సాయి పల్లవి.. ఆ తర్వాత ‘పడి పడి లేచే మనసు’, ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి చిత్రాలతో తన నటనను నిరూపించుకుంది. ప్రతి సినిమాలోనూ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ అభిమానులను పెంచుకుంది. ఇటీవల ‘అమరన్’, ‘తండేల్’ వంటి సినిమాలతో సాయి పల్లవి క్రేజ్ మరింత పెరిగింది. ముఖ్యంగా అమరన్ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. దీంతో దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ ఆమెకు గుర్తింపు పెరిగింది. ఇప్పటివరకు ప్రాంతీయ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన సాయి పల్లవికి ‘రామాయణం’ మరో పెద్ద మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




