- Telugu News Photo Gallery Cricket photos Bangladesh allrounder Shakib Al Hasan Smashes t20 Records, Enters into Elite List During BPL 2022
T20 Records: 5000 పరుగులు, 400 వికెట్లు.. టీ20 రికార్డుల్లో తగ్గేదేలే అంటోన్న ఆల్‌రౌండర్..!
Shakib Al Hasan: టీ20ల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు, 400 వికెట్లు తీసిన ఆటగాడిగా షకీబ్ నిలిచాడు. డ్వేన్ బ్రావో తర్వాత ఈ స్థానం సాధించిన రెండో ఆటగాడిగా మారాడు.
Updated on: Jan 25, 2022 | 10:05 AM

Bangladesh Premier League: ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో షకీబ్ అల్ హసన్‌కు చోటుదక్కలేదు. ఈసారి అతను కేవలం ఒక వికెట్ తీసి ఈ జాబితాలో తన పేరును చేర్చుకున్నాడు. ఈ జాబితాలో చేరిన ప్రపంచంలోని 5వ క్రికెటర్‌గా నిలిచాడు. జనవరి 24న ఫార్చ్యూన్ బరిషల్ వర్సెస్ మినిస్టర్ గ్రూప్ ఢాకా మధ్య జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో షకీబ్ ఓ స్పెషల్ బహుమతిని పొందాడు.

ఈ మ్యాచ్‌లో ఫార్చ్యూన్ బర్సల్ కెప్టెన్ షకీబ్, మినిస్టర్ గ్రూప్ ఢాకా కెప్టెన్ మహ్మదుల్లా వికెట్ తీశాడు. ఈ ఒక్క వికెట్‌తో షకీబ్ టీ20 క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. పురుషుల టీ20లో ఈ ఘనత సాధించిన ప్రపంచంలోని 5వ బౌలర్‌గా నిలిచాడు.

టీ20ల్లో 400 వికెట్లు తీసిన తొలి ఎడమచేతి వాటం ఆటగాడిగా షకీబ్ నిలిచాడు. అంతే కాకుండా టీ20ల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు, 400 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. డ్వేన్ బ్రావో తర్వాత ఈ స్థానం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

21.17 సగటు, 6.80 ఎకానమీతో 400 టీ20 వికెట్లు పడగొట్టి, షకీబ్ తన పేరును 5 వ బౌలర్‌గా లిఖించుకున్నాడు. ఇందులో అగ్రస్థానాన్ని ధోనీ స్నేహితుడు అంటే IPL జట్టు CSKలో కలిసి ఆడిన డ్వేన్ బ్రావో ఆక్రమించాడు. డ్వేన్ బ్రేవో ఇప్పటివరకు 24.42 సగటు, 8.21 ఎకానమీతో 554 టీ20 వికెట్లు తీశాడు.

400 టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఇమ్రాన్ తాహిర్ (435 వికెట్లు) రెండో స్థానంలో, సునీల్ నరైన్ (425 వికెట్లు) మూడో స్థానంలో, రషీద్ ఖాన్ (420 వికెట్లు) నాలుగో స్థానంలో ఉన్నారు.




