TS Schools Reopen: ఈ నెల 31 నుంచి తెలంగాణలో స్కూళ్లు తెరిచే అవకాశం.. కుదరని పక్షంలో..
TS Schools Reopen: థార్డ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను పొడగించిన విషయం తెలిసిందే. కరోనా కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని...
TS Schools Reopen: థార్డ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను పొడగించిన విషయం తెలిసిందే. కరోనా కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి 30 వరకు సెలవులను పొడగిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. అయిఏ విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం గత సోమవారం నుంచి 8,9,10 తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా జనవరి 30వ తేదీ దగ్గరపడుతోన్న క్రమంలో, 31 (సోమవారం) నుంచి స్కూళ్లను తిరిగి తెరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి ప్రత్యక్ష తరగతులను నిర్వహించే యోహనలో ప్రభుత్వం ఆలోచిస్తోంది. కరోనా తీవ్రత తక్కువగా ఉండడం, రానున్న రోజుల్లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అంచనావేసిన నేపథ్యంలో ఈనెల 31 నుంచి స్కూల్స్, కాలేజీలు తిరిగి ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఈ ఐదు రోజుల్లో కేసులు సంఖ్య భారీగా పెరిగినా, పరిస్థితులు అనుకూలించకపోయినా సెలవులను మరో వారం రోజుల పాటు పొడగించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్కూల్స్ తెరిచిన తర్వాత కూడా విద్యార్థులను స్కూళ్లకు పంపాలా వద్దా అనే ఛాయిస్ తల్లిదండ్రులకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పేరెంట్స్ ఇష్ట ప్రకారం నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Also Read: Samajwadi Party: 159 మంది అభ్యర్థులతో సమాజ్‌వాదీ తొలి జాబితా.. అఖిలేష్, ఆజం ఖాన్ ఎక్కడి నుంచంటే?
BSNL Plan: రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలకు గట్టి పోటీ ఇస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్ రూ.199 ప్లాన్..!
Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ ప్రతి ఒక్కరికి సోకుతుందా…? నిపుణులు ఏమంటున్నారు..?