AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT Recruitment: ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు రూ. 80 వేల వ‌ర‌కు జీతం పొందే అవ‌కాశం..

IIT Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భువనేశ్వర్‌లోని క్యాంప‌స్‌లో ఉన్న ప‌లు నాన్ టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

IIT Recruitment: ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు రూ. 80 వేల వ‌ర‌కు జీతం పొందే అవ‌కాశం..
Narender Vaitla
|

Updated on: Jan 25, 2022 | 9:51 AM

Share

IIT Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భువనేశ్వర్‌లోని క్యాంప‌స్‌లో ఉన్న ప‌లు నాన్ టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో రెసిడెంట్‌ డాక్టర్ (01), అసిస్టెంట్ ఇంజినీర్‌ (సివిల్‌) – 01, ప్రైవేట్ సెక్రటరీ (01), మీడియా అండ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటివ్ (01), జూనియ్‌ ఇంజినీర్ (02), ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్ (04) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు పోస్టుల‌ను అనుస‌రించి ఇంజినీరింగ్‌ డిప్లొమా/ బీఈ/ బెటక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత ప‌నిలో అనుభ‌వం త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు పోస్టుల ఆధారంగా 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను మొద‌ట ప‌ని అనుభవం ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అనంత‌రం ఇంటర్వ్యూ/ రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల ఆధారంగా నెల‌కు రూ. 20,000 నుంచి రూ.80,000 వరకు చెల్లిస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 04-02-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: LIC Credit Card: ఎల్ఐసీ పాల‌సీ దారుల‌కు ఉచితంగా క్రెడిట్ కార్డులు.. అదిరిపోయే ప్ర‌యోజ‌నాలు..

Supermarket Fruits: సూపర్‌ మార్కెట్లో పళ్లు కొంటున్నారా..? వీటిని తప్పకుండా గమనించండి..!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ది యోజన పథకాన్ని ఎస్‌బీఐలో ఎలా తెరవాలి..?