Cabinet Secretariat: కేబినేట్ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Cabinet Secretariat Recruitment: విదేశీ భాషల్లో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలపింది. న్యూఢిల్లీలోని కేబినేట్ సెక్రటేరియట్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన...
Cabinet Secretariat Recruitment: విదేశీ భాషల్లో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలపింది. న్యూఢిల్లీలోని కేబినేట్ సెక్రటేరియట్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన కేబినేట్ సెక్రటేరియట్ దేశవ్యాప్తంగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 38 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్లు (జీడీ) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* బాలోచి, భాస, బర్మీసీ, డారి, జోన్‌ఖా, దివేహి, కచిన్, రష్యన్, సిన్‌హళ వంటి విదేశీ భాషల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత పొందిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
* అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను పోస్ట్ బ్యాగ్ నెం.001, లోదీ రోడ్ హెడ్ పోస్టాఫీస్, న్యూదిల్లీ -110003 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 44,900 జీతంగా చెల్లిస్తారు.
* రాత పరీక్షను 240 మార్కులకు నిర్వహిస్తారు. 200 మార్కులకి రాత పరీక్ష, మిగిలిన 40 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 04-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Akhanda: బాలీవుడ్ ను తాకిన బాలయ్య క్రేజ్.. అఖండ హిందీ వర్షన్ కావాలంటూ డిమాండ్..
TS Schools Reopen: ఈ నెల 31 నుంచి తెలంగాణలో స్కూళ్లు తెరిచే అవకాశం.. కుదరని పక్షంలో..
Baking Soda Benefits: తినేసోడాను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు.. ఎలాంటి ఉపయోగాలు..!