Hyderabad: ఆస్తి రాయాలంటూ భార్య వేధింపులు..! 14వ అంతస్తు నుంచి కిందికి దూకిన ఐటీ ఉద్యోగి.. చివరకు..
హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.. తాను ఉంటున్న నివాసం 14 అంతస్తు బిల్డింగ్ పై నుంచి దూకి ఇంజనీర్ మరణించాడు.. ఈ విషాద ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీనివాసరావు హుజూర్‌నగర్ వాసి. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాదులోని స్థిరపడ్డాడు.

హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.. తాను ఉంటున్న నివాసం 14 అంతస్తు బిల్డింగ్ పై నుంచి దూకి ఇంజనీర్ మరణించాడు.. ఈ విషాద ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీనివాసరావు హుజూర్‌నగర్ వాసి. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాదులోని స్థిరపడ్డాడు. స్థానికంగా నల్లగండ్లలో ఉన్న రాంకీ గెలాక్సీయా అపార్ట్మెంట్స్ లోని 14 అంతస్తులో ఆయన నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజులుగా భార్యతో తరచూ శ్రీనివాస్ రావు కి గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దమనుషులు వచ్చి ఇరువురికి నచ్చచెప్పి పంచాయితీ చేసినా ఫలితం లేదు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ నిరంతరం ఆస్తి విషయంలో గొడవలు అవుతూనే ఉండేవి. సోమవారం ఉదయం అపార్ట్మెంట్ 14 ఫ్లోర్ నుండి శ్రీనివాసరావు కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ఘటన స్థలంలోనే శ్రీనివాసరావు మృతి చెందాడు.
ఈ క్రమంలోనే.. శ్రీనివాసరావు మృతిపై అనుమానం ఉందని.. అతని తల్లి కమలమ్మ చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడు శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకోవడానికి తన కోడలు జ్యోతినే కారణం అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్తులు మొత్తం తన పేరు మీద రాయాలని భర్త శ్రీనివాస్ రావు పై ఒత్తిడి తెచ్చింది. ఇదే శ్రీనివాసరావు ఆత్మహత్యకు కారణమని ఆయన తల్లి చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మానసిక ఒత్తిడికి గురైన శ్రీనివాసరావు తన భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులకి చెప్పటంతో చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన స్థలానికి చేరుకున్న చందానగర్ పోలీసులు శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఆయన భార్య జ్యోతి పాత్ర పైన చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




