Telangana: మూగబోయిన మగ్గాలు.. ప్రాణాలు కోల్పోతున్న నేతన్నలు.. ఈ సంక్షోభానికి కారణం ఏంటి..

సిరిసిల్లలో చేనేత పరిశ్రమ.. ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టడుతుంది. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు నేతన్న సమస్యలకు.. రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే అధికార పార్టీపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఆందోళన కు సిద్ధమవుతున్నాయి.

Telangana: మూగబోయిన మగ్గాలు.. ప్రాణాలు కోల్పోతున్న నేతన్నలు.. ఈ సంక్షోభానికి కారణం ఏంటి..
Rajanna Sirisilla District
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 07, 2024 | 3:06 PM

సిరిసిల్లలో చేనేత పరిశ్రమ.. ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టడుతుంది. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు నేతన్న సమస్యలకు.. రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే అధికార పార్టీపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఆందోళన కు సిద్ధమవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేతన్నలు రోడ్డు ఎక్కుతున్నారు. తమకు ఉపాధి కల్పించాలని వేడుకుంటున్నారు. అయితే.. కొత్త ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తామని హామీ ఇచ్చినా.. ఇంతవరకు ఆడర్ల జాడే లేదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 270 కోట్ల బకాయిలను ఇవ్వకుండా పెండింగ్ పెట్టడంతో దాంతో కొత్త పెట్టుబడులకు డబ్బులు లేని పరిస్థితి. దాని ఫలితంగా రూ.30 వేలకుపైగా మర మగ్గాలతో వస్త్ర ఉత్పత్తికి నేలవైన సిరిసిల్లలో మరమగ్గాలు మూగబోయాయి. వస్త్ర పరిశ్రమపైన ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల నేత కార్మికుల కుటుంబాలు ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు.

అన్నమో రామచంద్ర అంటూ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. మొన్నటి వరకు నేత కార్మికులు ఆందోళన బాటలు, రిలే నిరాహార దీక్షలు, వంటా వార్పు కార్యక్రమాలు చేసిన ప్రయోజనం లేకపోయింది. వస్త్ర వ్యాపార సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేతన్నల మహా గర్జన సభకు శంఖారావం పూరించారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్లాకు ఏటా రూ.320 కోట్లు వెచ్చించింది. అధికారిక లెక్కల ప్రకారం 2020 నుంచి 2023 వరకు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు టేస్కో ద్వారా గత ప్రభుత్వం రూ.265 కోట్ల బకాయి పడింది. అంతేకాకుండా 2022, 2023 రెండు సంవత్సరాలకు రూ.18 కోట్ల యారణ్ సబ్సిడీ కార్మికులకు చెల్లించాల్సి ఉంది. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలను చెల్లించకపోవడంతో వస్త్ర ఉత్పత్తికి పెట్టుబడులు లేక మరమగ్గాలను మూసివేసే పరిస్థితి నెలకొంది. జనవరి మాసంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కురుకుపోయింది. పెండింగ్ బిల్లులతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడం నేత కార్మికులు ఆందోళనకు దిగారు.

ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలతో పాటు, ప్రభుత్వ అన్ని శాఖల సంబంధించిన ఆర్డర్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో సిరిసిల్ల నేత కార్మికులు మురిసిపోయారు. ఈ క్రమంలో స్కూలు యూనిఫామ్‎లకు సంబంధించిన 44 లక్షల మీటర్ల ఆర్డర్లను సిరిసిల్ల నేత కార్మికులకు రేవంత్ నయా సర్కార్ అందించింది. అయితే స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు నేత కార్మికులకు కనీసం 15 నుంచి 25 రోజులు మాత్రమే ఉపాధి కల్పించాయి. స్కూల్ యూనిఫామ్ బట్ట తయారీ ముగియడంతో మళ్లీ ఇప్పుడు నేత కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై నేత కార్మికులు పెట్టుకున్న ఆశలు నిరాశ గానే మిగిలిపోయాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా బతుకమ్మ చీరల ఆర్డర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం జనవరి నుంచి ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే బతుకమ్మ చీరల ఆర్డర్లను సిరిసిల్లకు ఇచ్చేది. ఏప్రిల్ నెల ప్రారంభమైన ఇంతవరకు బతుకమ్మ చీరల ఆర్డర్లను జాడలేదు. దాంతో వేలమంది కార్మికులతో కార్మిక సంఘాలు ప్రభుత్వం వస్త్ర పరిశ్రమలు సంక్షోభంలో నుంచి నివారించాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి.

ఇవి కూడా చదవండి

గత మూడు నెలలుగా దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు ఇలా ఏదో ఒక రూపంలో నేత కార్మికులు తమ నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని, తాజాగా వస్త్ర వ్యాపార సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నేతన్నల మహా గర్జన సభను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నేత కార్మికులకు చేతినిండా ఉపాధి కల్పించడం. అలాగే పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయడం. అంతేకాకుండా కరెంటు సబ్సిడీ కొనసాగిస్తూ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న ముఖ్యమైన ఎజెండాలతో ఈ మహగర్జన సభను నిర్వహించారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రూ. 270 కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఇప్పటికే సిరిసిల్ల ఇన్చార్జి, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‎లతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో చర్చించామని తెలిపారు. దశల వారీగా బకాయిలు చెల్లిస్తామని మూడు నెలలు గడుస్తున్నా స్పందన లేదు. ఫలితంగా పెట్టుబడులు లేక ఖర్కానాలు మూసివేయవలసిన పరిస్థితి నెలకొంది.

దాంతో వేలమంది నేత కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వం బకాయిలను వెంటనే చెల్లిస్తే కొంత ఊరట లభిస్తుందని, అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ సబ్సిడీ రాష్ట్రంలో ఎత్తివేయడం మరింత సంక్షోభంలో కోరుకుపోయిందని అన్నారు. సంచాలు మూగపోవడంతో గత నెలలో ఒకరు, ఈనెల 6 తేదీన శనివారం రోజున ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కావడంతో..అధికార పార్టీని నీలదీస్తున్నాయి. అంతేకాకుండా సిరిసిల్ల నియోజకవర్గంకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహించడంతో ఈ సమస్యను మరింత ఫోకస్ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. అదే విధంగా బీజేపీ నేత బండి సంజయ్ నేతన్న కుటుంబాన్ని పరామర్శించి.. లక్ష పరిహారం అందించారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ఈ నెల 10 న నేత కార్మికుల కోసం.. దీక్ష చేపట్టానున్నారు బండి సంజయ్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!