Chicken Price: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ట్రిపుల్ సెంచరీ దాటి..
మాసం ప్రియులకు ఇది నిజంగా చేదువార్తే. ఎందుకంటే చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. భానుడి భగభగలతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ఏకంగా త్రిబుల్ సెంచరీ దాటింది. కడుపు నిండా చికెన్ తినాలంటే జేబు కాస్త ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది.
మాసం ప్రియులకు ఇది నిజంగా చేదువార్తే. అటు నడినెత్తిమీద నిప్పులవాన కురుస్తుంటే, ఇటు చికెన్ రేటు కూడా మండిపోతోంది. సండేనాడు చికెన్ ముక్క లాగించేద్దామంటే ధరలు షాక్ కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర ట్రిపుల్ సెంచరీ కొట్టింది. వారం రోజుల్లో కేజీకి వంద రూపాయలు పెరిగింది. ఆదివారం కదా అని చికెన్ దుకాణానికి వెళ్లినవారు, కోడిమాంసం ధర 300 రూపాయలు అనేటప్పటకీ పరేషాన్ అవుతున్నారు.. వాస్తవానికి చికెన్.. ముక్క లేనిది ముద్ద దిగదు కొందరికీ. మెనూలో చికెన్ వంటకం ఉండాల్సిందే. కానీ గత కొద్దిరోజులుగా కొండెక్కి కూర్చున్న చికెన్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గత వారం వరకు కిలో చికెన్ రేటు 200-240 రూపాయల మధ్య ఉండగా.. ఇప్పుడు మరింత పెరిగి కిలో ఏకంగా 300 రూపాయలు పలుకుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే.. 320 వరకు ధర ఉంది. అయితే, వారం వ్యవధిలోనే కేజీకి రూ.60 నుంచి 100 మేర చికెన్ ధర పెరిగినట్లు పేర్కొంటున్నారు. చికెన్ రేటు మరో రెండు నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. మండుతున్న ఎండలు కోళ్ల ఉత్పత్తి బాగా తగ్గి పోయిందని పేర్కొంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్, విజయవాడలో చికెన్ రేటు కేజీ.. రూ.300 నుంచి 320 వరకు పలుకుతోంది.. లైవ్ కోడి ధర రూ.220 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. ఇక నాటు కోడి కేజీ రూ.500 వరకు విక్రయిస్తున్నారు. కోడి గుడ్డు ఒక్కొక్కటి రూ. 6 వరకు విక్రయిస్తున్నారు.
పెరిగిన ఎండలతోపాటు, దాణ రేట్లు పెరగడం.. ఉత్పత్తి తగ్గడంతో చికెన్ ధరలు కొండెక్కినట్లు పేర్కొంటున్నారు. ఏప్రిల్ నెలలోనే ఇదే పరిస్థితి ఉంటే.. మే, జూన్ నెలల్లో చికెన్ రేట్లు అమాంతం పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..