AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెగించిన బంధువులు.. కోట్ల ఆస్తి ఉన్నా దిక్కులేని దీనస్థితిలో ముసలవ్వ..! ఏం జరిగిందంటే

భర్తతో కలిసి కష్టపడి కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించిన వృద్ధ మహిళకు... వృద్ధాప్యంలో దక్కింది మాత్రం అన్యాయం, అవమానం, అశ్రద్ధ మాత్రమే.. భర్త మరణించిన తర్వాత ఆస్తిపై కన్నేసిన భర్త తరపు బంధువులు ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు. వయసు మీద పడటంతో జారిపడి కాలు విరగడంతో నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలు తమకు న్యాయం చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ను కలిశారు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.,

తెగించిన బంధువులు.. కోట్ల ఆస్తి ఉన్నా దిక్కులేని దీనస్థితిలో ముసలవ్వ..! ఏం జరిగిందంటే
Elderly Womans Property Snatched By Relatives
M Sivakumar
| Edited By: |

Updated on: Dec 23, 2025 | 9:36 PM

Share

విజయవాడ, డిసెంబర్‌ 23: భర్తతో కలిసి కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని సంపాదించిన వృద్ధురాలికి వృద్ధాప్యంలో దిక్కు లేకుండా పోయింది. భర్త మృతి చెందిన అనంతరం ఆయన తరపు బంధువులే ఆమె ఆస్తిని లాక్కొని వృద్ధురాలికి అన్నం పెట్టకుండా ఇంటి నుంచి జెంటివేయడంతో ఆమె జీవితం దయనీయంగా మారింది. వృద్ధాప్యంలో జారిపడి కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుంది. కార్యాలయం ప్రాంగణంలో చెట్టు కింద అచేతనంగా పడి ఉండడంతో అక్కడ ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆమె సమీప బంధువు వెంకటరత్నం అక్కడికి చేరుకొని వృద్ధాప్యం కారణంగా నీరసంతో పడిపోయిందని చెప్పడంతో అందరూ ఊపిరిపించుకున్నారు.

వికాస్ నగర్ కి చెందిన వెంకాయమ్మ పొన్నూరు మండలం కొత్త పాలెం కు చెందిన సుబ్బారావుకు రెండో భార్య. పిల్లలు లేకపోయినా భర్తతో కలిసి వ్యవసాయం చేస్తూ కొత్తపాలెంలో ఒకటి పాయింట్ పదహారే ఎకరాల పొలం, 10 సెంట్లు భవనం, మరో 10 సెంట్లు ఖాళీ స్థలాన్ని సంపాదించారు. నాలుగేళ్ల క్రితం భర్త సుబ్బారావు మృతి చెందడంతో భర్త తరపు వారు ఆమె ఆస్తిని స్వాధీనం చేసుకొని ఇంటి నుంచి గెంటి వేశారు.

ఆ తర్వాత వెంకాయమ్మను వెంకటరత్నం వికాస్ నగర్ కు తీసుకువెళ్లి సంరక్షిస్తున్నారు. ప్రభుత్వం అందించే వృద్ధాప్య పెన్షన్‌తో జీవనం సాగిస్తున్న ఆమె ఇటీవల జారిపడి కాలు విరిగింది. దీంతో ఆమె పూర్తిగా నడవలేని స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో తన ఆస్తిలో కొంత భాగం అయినా ఇప్పిస్తే దానిని అమ్ముకొని వైద్యం చేయించుకోవడంతో పాటు జీవనోపాధికి ఉపయోగపడుతుందని పోలీసులను ఆమె వేడుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ చేపట్టి వృద్ధురాలికి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కోట్ల ఆస్తి ఉన్నా దిక్కులేని దీనస్థితిలో ముసలవ్వ..! ఏం జరిగిందంటే
కోట్ల ఆస్తి ఉన్నా దిక్కులేని దీనస్థితిలో ముసలవ్వ..! ఏం జరిగిందంటే
పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ మహిధర్.. అమ్మాయి ఎవరో తెలుసా?
పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ మహిధర్.. అమ్మాయి ఎవరో తెలుసా?
మోటరోలా ఎడ్జ్‌ 70.. ధర, ఆఫర్లు, ఫీచర్లు ఇవే!
మోటరోలా ఎడ్జ్‌ 70.. ధర, ఆఫర్లు, ఫీచర్లు ఇవే!
రేపట్నుంచే క్రిస్మస్‌ సెలవులు.. అక్కడ స్కూళ్లకు 20 రోజులు హాలిడ
రేపట్నుంచే క్రిస్మస్‌ సెలవులు.. అక్కడ స్కూళ్లకు 20 రోజులు హాలిడ
అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌.. తక్కువ ధరల్లో ఎక్కువ మైలేజీ..!
అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌.. తక్కువ ధరల్లో ఎక్కువ మైలేజీ..!
వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఏపీలో ప్రభుత్వం ఇంటింటి సర్వే.. ఎందుకంటే..?
ఏపీలో ప్రభుత్వం ఇంటింటి సర్వే.. ఎందుకంటే..?
పాలు తాగితే గుండె జబ్బులు వస్తాయా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
పాలు తాగితే గుండె జబ్బులు వస్తాయా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
రోజూ గుడ్డు తింటే క్యాన్సర్‌ వస్తుందా? FSSAI క్లారిటీ ఇదిగో..
రోజూ గుడ్డు తింటే క్యాన్సర్‌ వస్తుందా? FSSAI క్లారిటీ ఇదిగో..
వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!
వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!