AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఇంటింటి సర్వేకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం. అందుకేనా?

రాష్ట్రంలోని ప్రతి కుటుంబ వివరాలు ఖచ్చితంగా నమోదు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏకీకృత కుటుంబ సర్వే (UFS) ప్రారంభిస్తోంది. అర్హులెవ్వరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి తప్పిపోకుండా చూడటమే లక్ష్యం. డిసెంబర్ చివరి వారం నుంచి ఇంటింటి సర్వే చేపట్టి, మొబైల్ యాప్–ఆధార్ ధృవీకరణతో డేటా నవీకరణ చేయనున్నారు.

Andhra: ఇంటింటి సర్వేకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం. అందుకేనా?
Andhra Government
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Dec 23, 2025 | 9:10 PM

Share

రాష్ట్రంలోని ప్రతి కుటుంబ వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో ఖచ్చితంగా నమోదు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకీకృత కుటుంబ సర్వే (UFS)కు శ్రీకారం చుట్టింది. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు సకాలంలో అందేలా చేయడమే ఈ సర్వే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజా సేవల పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది.

డిసెంబర్ నెల చివరి వారం నుంచి ఏకీకృత కుటుంబ సర్వే ప్రారంభం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయాల సిబ్బంది, పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబ ప్రస్తుత పరిస్థితిని ధృవీకరించి, అవసరమైన వివరాలను నవీకరించేందుకు ప్రభుత్వ సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించనున్నారు.

అర్హులెవ్వరూ తప్పిపోకుండా ఉండడమే లక్ష్యం

ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి అర్హత ఉన్న ఏ కుటుంబం లేదా వ్యక్తి తప్పిపోకుండా చూడడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఖచ్చితమైన, తాజా కుటుంబ రికార్డుల ద్వారా ప్రభుత్వ ధృవపత్రాలు, అనుమతుల జారీ ప్రక్రియలో సమయం ఆదా అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ సర్వే ద్వారా సమీకరించిన సమాచారంతో ప్రభుత్వ విభాగాల మధ్య ధృవీకరణ అవసరం ఇకపై ఉండదు.

డేటా ఖచ్చితత్వంపై దృష్టి

ప్రభుత్వ సమాచారం ఖచ్చితత్వం, పరిపూర్ణతను పెంచడం కూడా ఈ సర్వే మరో లక్ష్యం. కుటుంబ వివరాలను నేరుగా ఇంటి వద్దే నవీకరించడం ద్వారా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా ప్రణాళికాబద్ధంగా అమలు చేసే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్ సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు కూడా ఈ డేటా కీలకంగా ఉపయోగపడనుంది. మొబైల్ యాప్ ద్వారా సర్వే ఏకీకృత కుటుంబ సర్వేను ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా నిర్వహించనున్నారు. దీంతో సమాచారం వేగంగా, ఖచ్చితంగా నమోదు అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వివరాలను సాధ్యమైన చోట్ల ముందుగానే పొందుపరిచి, ప్రతి కుటుంబానికి పట్టే సమయాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఆధార్‌తో సురక్షిత ధృవీకరణ

ఆధార్ ఆధారిత ప్రామాణీకరణ ద్వారా గుర్తింపు ధృవీకరణ సురక్షితంగా చేపడతామని అధికారులు తెలిపారు. పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతకు పూర్తి ప్రాధాన్యం ఇస్తామని, రికార్డులు సరైనవని నిర్ధారించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పారదర్శక పాలన దిశగా అడుగు పాలనలో పారదర్శకతను పెంచడం, పౌర కేంద్రీకృత పాలన దిశగా ముందుకు వెళ్లడం కోసం ఏకీకృత కుటుంబ సర్వే ఒక కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. సర్వేకు ప్రజలు సహకరించి సరైన సమాచారం అందిస్తే, ప్రభుత్వ సేవలు మరింత సజావుగా, వేగంగా అందే అవకాశం ఉంటుందని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.