Chiranjeevi: ‘మీరు లేనిదే.. నేను లేను’ మెగాస్టార్ ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాదు' సినిమా విజయంతో మరో ఇండస్ట్రీ రికార్డు సృష్టించి భావోద్వేగానికి లోనయ్యారు. తన అభిమానులు, తెలుగు ప్రేక్షకులు, చిత్ర బృందానికి సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకుల ఆదరణే తన శక్తి అని, వారి ప్రేమ శాశ్వతమని పేర్కొంటూ, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు, సుస్మితలను అభినందించారు.
మన శంకర వర ప్రసాదు గారు మరో ఇండస్ట్రీ రికార్డ్ సెట్ చేయడంతో.. మెగాస్టార్ చిరు ఎమోషనల్ అయ్యారు. తన ఫ్యాన్స్‌కు స్పెషల్ థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తన సినిమాపై ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే.. తన మనసు కృతజ్ఞత భావనతో నిడిపోయిందన్నారు మెగాస్టార్. అంతేకాదు తన జీవితం.. తెలుగు ప్రేక్షకులు, తన అభిమానుల ప్రేమాభిమానాలతో ముడిపడిందని.. మీరు లేనిదే తాను లేనంటూ.. చిరు తన పోస్టులో కోట్ చేశారు. మన శంకర వర ప్రసాదు సినిమా విజయంతో మరో సారి అది నిజమని నిరూపితమైందన్నారు. ఈ విజయం పూర్తిగా తన ప్రియమైన తెలుగు ప్రేక్షకులు.. తన ప్రాణసమానమైన అభిమానులదే కాదు.. తన డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది.. ముఖ్యంగా దశాబ్దాలుగా తన వెంట నిలబడి ఉన్నవారందరిది అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు చిరు. అంతేకాదు వెండితెర మీద తనను చూడగానే.. ప్రేక్షకులు, అభిమానులు వేసే విజిల్స్, చప్పట్లే తనను నడిపించే తన శక్తి అంటూ పేర్కొన్నా చిరు. ‘రికార్డులు వస్తుంటాయి – పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్ మెషిన్ అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు & సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, ధన్యవాదాలు అంటూ మెగాస్టార్ రాసుకొచ్చారు. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో… లవ్ యూ ఆల్.. మీ చిరంజీవి అంటూ రాసుకొచ్చారు. తన పోస్టుతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు చిరు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naveen Polishetty: రూ.100 కోట్ల ఆనందంలో.. నవీన్ భావోద్వేగం
Chiranjeevi: బాక్సాఫీస్ కలెక్షన్స్‌లో.. మెగాస్టార్ ఆల్ టైం రికార్డ్
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం అమ్మినరోజే నగదు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా వేసాడు
ప్రయోజకుడై వచ్చిన కొడుకు.. కూరగాయలు అమ్ముకునే తల్లి రియాక్షన్
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

