ప్రయోజకుడై వచ్చిన కొడుకు.. కూరగాయలు అమ్ముకునే తల్లి రియాక్షన్
మహారాష్ట్రకు చెందిన గోపాల్ సావంత్ CRPF ఉద్యోగం సాధించి, కూరగాయలు అమ్ముకునే తన తల్లికి తీపి కబురు చెప్పాడు. కొడుకు సర్‌ప్రైజ్‌తో తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తల్లిదండ్రుల త్యాగాలకు దక్కిన ప్రతిఫలంగా నెటిజన్లు దీనిని అభివర్ణించారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని, తల్లిదండ్రులను గౌరవించాలని ఈ వీడియో స్ఫూర్తినిస్తుంది.
తల్లితండ్రులు తమ పిల్లలు వృద్ధిలోకి రావాలని ఎంతో కష్టపడతారు.. ఎన్నో త్యాగాలు చేసి పిల్లలే సర్వస్వం అని బ్రతుకుతారు. పిల్లలు పెరిగి ప్రయోజకులైనప్పుడు వారి ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా ఎంతో కష్టపడి చదివించిన కొడుకు శ్రద్ధగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి తన ముందు నిలబడిన కుమారుడిని చూసి ఆ తల్లి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. కోట్లాదిమంది హృదయాలను తడుముతోంది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాకు చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు సీఆర్పీఎఫ్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని తన కుటుంబ పోషణ కోసం రోజూ ఫుట్‌పాత్‌పై కూరగాయలు విక్రయించే తల్లికి చెప్పడానికి నేరుగా ఆమె దగ్గరకే వెళ్లాడు. కుడాల్ నగర్ పంచాయతీ పరిధిలోని ఫుట్‌పాత్‌పై ఉన్న తల్లికి ఈ విషయం చెప్పగా, ఆమె మొదట ప్రశాంతంగా విని, ఆ తర్వాత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ భావోద్వేగభరిత దృశ్యాన్ని చిత్రీకరించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను స్థానిక భాషలో ఓ క్యాప్షన్‌తో షేర్ చేశారు. అతి తక్కువ సమయంలోనే ఈ వీడియోను 12 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఓ సాధారణ కుటుంబం పడిన కష్టానికి దక్కిన విజయంగా నెటిజన్లు దీనిని అభివర్ణించారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని తెలిపే ఈ వీడియో స్ఫూర్తినిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఆ తల్లి పడిన కష్టానికి నిజమైన ఫలితం దక్కింది. ఇలాంటి కొడుకును కన్నందుకు ఆమె చాలా అదృష్టవంతురాలు అంటూ ఓ యూజర్ అభిప్రాయపడ్డారు. సోదరా… తల్లి రుణం తీర్చుకున్నావు… ఇప్పుడు నీ తల్లిదండ్రులను బాగా చూసుకో అంటూ మరొకరు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ ఏడాది ట్రావెన్‌కోర్ బోర్డుకు రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతో తెలుసా?
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. ముంగిట్లో ఉన్నది చూసి మూర్ఛపోయాడు
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి.. అసలు ఏం జరిగింది
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

