భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా వేసాడు
మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా జరుగుతున్న మోసాలకు బెంగళూరుకు చెందిన నవ్య శ్రీ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బాధితురాలిగా మారింది. ఒక్కలిగ మ్యాట్రిమోనీలో పరిచయమైన విజయ్ రాజ్ గౌడ, నకిలీ వ్యాపారిగా నమ్మించి, ED కేసు పేరుతో, వ్యాపారం పేరిట ఆమె నుండి, ఆమె స్నేహితుల నుండి, తల్లిదండ్రుల రిటైర్‌మెంట్ ఫండ్ నుండి, నగలు తాకట్టు పెట్టి రూ. 1.53 కోట్లు వసూలు చేశాడు. చివరికి అతనికి పెళ్లైందని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల ముఠాల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఏకంగా రూ. 1.53 కోట్లు పోగొట్టుకుంది. నవ్య శ్రీ అనే యువతికి.. 2024 మార్చిలో ఒక్కలిగ మ్యాట్రిమోనీలో విజయ్ రాజ్ గౌడ అలియాస్ విజేత్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను బాగా డబ్బున్న వ్యక్తిని అని ఆమెను నమ్మించాడు. తనను తాను పెద్ద బిజినెస్‌మెన్‌గా పరిచయం చేసుకున్న విజయ్.. తన వద్ద క్రషర్లు, లారీలు, రాజాజీనగర్, సదాశివనగర్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో భూములు ఉన్నాయని వారిని నమ్మించాడు. తన మొత్తం ఆస్తి విలువ రూ. 715 కోట్లు అని వారిని బురిడీ కొట్టించాడు. 2019 నాటి ఒక ఈడీ కేసులో తన బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయని హైకోర్టు, సుప్రీం కోర్టుకు సంబంధించిన నకిలీ బెయిల్ పత్రాలను చూపించాడు. పరిచయమైన నెలకే 2024 ఏప్రిల్‌లో నవ్య శ్రీ వద్ద నుంచి రూ. 15 వేలను ఫోన్ పే ద్వారా తీసుకున్నాడు. అంతా కలిసి వ్యాపారం చేద్దామని లాభాలను సమంగా పంచుకుందామని నమ్మించి ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్స్ నుంచి కూడా సుమారు రూ. 89 లక్షలు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా నవ్య శ్రీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తనపై కోర్టు కేసులు ఉన్నాయని.. అవి క్లియర్ అయితేనే ఆస్తులు చేతికి వస్తాయని నమ్మించి వారి రిటైర్మెంట్ ఫండ్ నుంచి రూ. 28.5 లక్షలు తీసుకున్నాడు. నవ్య శ్రీ నగలను తాకట్టు పెట్టి మరో రూ. 10 లక్షలు తీసుకున్నాడు. డబ్బు తిరిగి ఇవ్వమని నవ్య శ్రీ విజయ్ ఇంటికి వెళ్లింది. అక్కడే ఆమెకు అసలు షాక్ తగిలింది. విజయ్‌కి అప్పటికే పెళ్లియి ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిసింది. అంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే.. గతంలో తనకు చెల్లెలు అని పరిచయం చేసిన మహిళే విజయ్‌కి భార్య అని తెలుసుకుని మరింత షాక్‌కు గురైంది. నవ్యశ్రీతో పాటు ఆమె సంబంధీకుల నుంచి మొత్తం రూ. 1.75 కోట్లు వసూలు చేయగా.. కేవలం రూ. 22 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చి.. మిగిలిన రూ. 1.53 కోట్లు ఎగ్గొట్టాడు. పూర్తిగా మోసపోయామని గుర్తించిన బాధితురాలు… పోలీసులను ఆశ్రయించగా విజయ్, అతని తండ్రి, భార్యపై కేసు నమోదైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రయోజకుడై వచ్చిన కొడుకు.. కూరగాయలు అమ్ముకునే తల్లి రియాక్షన్
ఈ ఏడాది ట్రావెన్‌కోర్ బోర్డుకు రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతో తెలుసా?
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. ముంగిట్లో ఉన్నది చూసి మూర్ఛపోయాడు
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి.. అసలు ఏం జరిగింది
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

