కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
రాజస్థాన్‌కు చెందిన శివ్ జోహ్రీ, తన కుమార్తె వివాహం కోసం 3 కిలోల వెండితో, రూ.25 లక్షల అద్భుత వెడ్డింగ్ కార్డును తయారు చేయించారు. ఏడాది శ్రమతో, 65 మంది దేవతామూర్తుల విగ్రహాలతో రూపొందిన ఈ ప్రత్యేక ఆహ్వాన పత్రికను ఆయన స్వయంగా డిజైన్ చేశారు. దేవతలను సైతం ఆహ్వానించి, భవిష్యత్ తరాలకు జ్ఞాపికగా నిలిచే అపురూప కళాఖండమిది.
రాజస్థాన్‌కు చెందిన ఒక తండ్రి తన కూతురి పెళ్లిని గ్రాండ్‌గా చేయాలని నిర్ణయించి అందుకోసం వెండితో వెడ్డింగ్ కార్డును కంసాలులకు చెప్పి తయారు చేయించారు. జైపూర్‌కు చెందిన శివ్ జోహ్రీ అనే వ్యక్తి తన కుమార్తె శృతి వివాహం కోసం 3 కిలోల వెండితో రూ.25 లక్షల ఖర్చుతో ఒక అద్భుత వెండి కార్డును తయారు చేయించారు. 65 మంది దేవతామూర్తుల విగ్రహాలున్న ఆ వెడ్డింగ్ కార్డు తయారీకి ఏడాది సమయం పట్టింది. తన కుమార్తె పెళ్లి ఆహ్వాన పత్రికను స్వయంగా తనే డిజైన్ చేసారు శివ్ జోహ్రీ . కేవలం బంధుమిత్రులనే కాకుండా.. సకల దేవతలను తన కూతురి పెళ్లికి ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఇలా 65 మంది దేవతా మూర్తులతో ఆ వెడ్డింగ్ కార్డు తయారు చేసినట్లు చెప్పారు. ఈ పెళ్లి పత్రిక.. తమ భవిష్యత్ తరాలకు ఒక జ్ఞాపికగా మిగిలిపోవాలని కోరుకున్నానని అన్నారు. ఆహ్వాన పత్రిక మధ్యలో వధూవరుల పేర్లు శృతి జోహ్రీ.. హర్ష్ సోని.. లోపలి భాగంలో కుటుంబ సభ్యుల పేర్లను కూడా వెండిపైనే చెక్కించారు. ఆ వెడ్డింగ్ కార్డు తయారు చేయడానికి 128 వెండి ముక్కలను ఉపయోగించారు. ఆశ్చర్యం ఏంటంటే.. ఆ కార్డును అమర్చడానికి ఎక్కడా ఒక్క మేకు లేదా స్క్రూను కూడా వాడలేదు. వెండి కార్డుపై అతి సూక్ష్మంగా దాదాపు 65 మంది దేవతల ఫోటోలను చెక్కారు. వెడ్డింగ్ కార్డు పై భాగంలో వినాయకుడు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు కొలువై ఉన్నారు. వీరితోపాటు.. శ్రీకృష్ణుడి జీవిత ఘట్టాలు, విష్ణుమూర్తి దశావతారాలు.. 8 రూపాల్లో అష్టలక్ష్మి ప్రతిమలను పొందుపరిచారు. ఇక కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి రెండు రూపాల్లో దర్శనమివ్వగా.. శంఖుచక్రాలు, ఏనుగులు పూల వర్షం కురిపిస్తున్నట్లుగా అత్యంత కళాత్మకంగా ఆ వివాహ ఆహ్వాన పత్రికను తీర్చిదిద్దారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: దండోరా మూవీపై ఎన్టీఆర్ రివ్యూ
Akshay Kumar: ప్రమాదం నుంచి తప్పించుకోవడమే కాదు క్షతగాత్రులకు సాయం చేసిన స్టార్ హీరో
Chiranjeevi: ‘మీరు లేనిదే.. నేను లేను’ మెగాస్టార్ ఎమోషనల్
Naveen Polishetty: రూ.100 కోట్ల ఆనందంలో.. నవీన్ భావోద్వేగం
Chiranjeevi: బాక్సాఫీస్ కలెక్షన్స్‌లో.. మెగాస్టార్ ఆల్ టైం రికార్డ్
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్‌కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?
హోలీ పండగలో వాడే కెమికల్ రంగులపై వైద్యుల వార్నింగ్!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!

