ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం అమ్మినరోజే నగదు
ఏపీ కూటమి ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం విక్రయించిన వెంటనే, 24 గంటల్లోగా లేదా అదే రోజు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఈ కొత్త విధానంతో రైతులు ఇక వారాల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఇది రాష్ట్రంలోని రైతులకు ఎంతో ఉపశమనం కలిగిస్తోంది, ఆర్థికంగా అండగా నిలుస్తోంది.
ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు ధాన్యం అమ్మిన కేవలం 24 గంటల్లోనే రైతుల అకౌంట్లలోకి డబ్బులు విడుదల చేశారు. ఇంతకుమందు ధాన్యం విక్రయించిన తర్వాత రైతులు వారాల పాటు ఎదురుచూడాల్సిన అవసరం ఉండేదని, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదని మంత్రి దెండ్ల మనోహర్ తెలిపారు.ఉదయం ధాన్యం విక్రయిస్తే సాయంత్రం కల్లా రైతుల అకౌంట్లోకి తప్పనిసరిగా డబ్బులు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతులకు ఈ కొత్త నిర్ణయం ఊరట కలిగిస్తోంది. ఇక నుంచి సేకరణ కేంద్రాల్లో ధాన్యం అమ్మిన తర్వాత డబ్బులు ఎప్పుడు పడతాయనేది రైతులు ఎదురుచూపులు చూడాల్సిన అవసరం లేదు. ధాన్యం విక్రయించాక రైతుల బ్యాంకు వివరాలను అధికారులు తీసుకుంటారు. అనంతరం ఆ బ్యాంక్ అకౌంట్‌లో నిధులు జమ చేస్తారు. గుంటూరు, తిరుపతి, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ కొనసాగుతుంది. ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 41.69 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దీని ద్వారా ఇప్పటివరకు 6 లక్షల 83 వలే 623 మంది రైతుల అకౌంట్లలో రూ.9,890 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. రైతుల నుంచి రబీ సీజన్‌లో పండిన ధాన్యం సేకరించేందుకు అన్నీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల్లో ఇందుకు అవసరమైన టెక్నాలజీ ఉపయోగించుకనేలా సిబ్బంది శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, రైతులకు నిధుల విడుదలపై మంత్రి అధికారులతో చర్చించారు. అనంతరం ధాన్యం అమ్మిన రోజే రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై ఏపీలోని రైతలుందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా వేసాడు
ప్రయోజకుడై వచ్చిన కొడుకు.. కూరగాయలు అమ్ముకునే తల్లి రియాక్షన్
ఈ ఏడాది ట్రావెన్‌కోర్ బోర్డుకు రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతో తెలుసా?
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. ముంగిట్లో ఉన్నది చూసి మూర్ఛపోయాడు
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి.. అసలు ఏం జరిగింది
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

