అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాలు పసిడి, వెండి ధరలను గణనీయంగా పెంచాయి. గ్రీన్‌ల్యాండ్ వివాదం నేపథ్యంలో యూరోపియన్ దేశాలపై సుంకాల హెచ్చరికలు ఇన్వెస్టర్లను బంగారం వైపు మళ్లించాయి. జనవరి 19న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹1910, కేజీ వెండిపై ₹8000 పెరిగి రికార్డు స్థాయికి చేరాయి.