తమిళనాడు అరియలూరు జిల్లా సెందురైలో జరిగిన ప్రత్యేక పోటీల్లో దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భర్తలు తమ భార్యల్ని ఎత్తుకుని 20 మీటర్ల దూరం పరుగెత్తారు. ముందుగా గమ్యం చేరిన వారిని విజేతలుగా ప్రకటించి బహుమతులు అందించారు. ఈ వినూత్న పోటీ స్థానికులను విశేషంగా ఆకర్షించింది.