AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా పాలిట విలన్లు వీరే.! ఆ ముగ్గురు లేకుంటే వన్డే జట్టు సేఫ్.. ఎవరంటే.?

టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. వన్డేల్లో టీమిండియా బౌలింగ్ అట్టర్ ప్లాప్ అవుతోందని నొక్కి చెబుతున్నారు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణల పేలవ ప్రదర్శన ఇందుకు కారణమన్నారు.

Team India: టీమిండియా పాలిట విలన్లు వీరే.! ఆ ముగ్గురు లేకుంటే వన్డే జట్టు సేఫ్.. ఎవరంటే.?
Team India
Ravi Kiran
|

Updated on: Jan 22, 2026 | 9:00 AM

Share

పులిలా ఉండే టీమిండియా పిల్లిలా మారిపోయింది. ఇటీవల న్యూజిలాండ్‌ చేతిలో వన్డే సిరీస్ ఓడిపోయినా సంగతి తెలిసిందే. వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో సిరీస్ కోల్పోవడం భారత జట్టుకు అతిపెద్ద షాక్. టీమిండియా ఓటముల పరంపర టెస్ట్ క్రికెట్‌లో మాత్రమే కాకుండా, వన్డే ఫార్మాట్‌కు కూడా పాకిపోయిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. టీ20 ప్రపంచకప్ కారణంగా ద్వితీయ శ్రేణి జట్టును పంపిన న్యూజిలాండ్.. ఈ భారత జట్టును సునాయాసంగా రఫ్ ఆడించింది. సిరీస్‌ను 1-2తో కివీస్‌కు కోల్పోయింది.

ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

దీనిపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం టీమిండియా బౌలింగ్ వైఫల్యాన్నే సిరీస్ ఓటమికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు. తొలి మ్యాచ్‌లో తప్ప మిగతా రెండు మ్యాచ్‌లలోనూ మధ్య ఓవర్లలో వికెట్లను రాబట్టలేకపోవడం వల్లే టీమిండియా సిరీస్‌ను కోల్పోవాల్సి వచ్చిందని సునీల్ గవాస్కర్ స్పష్టం చేశారు. ఈ సిరీస్‌లో ముగ్గురు భారత ప్లేయర్లు అత్యంత చెత్త ప్రదర్శన చేశారని, వారిని వెంటనే జట్టు నుంచి తొలగించాలని, లేకపోతే రాబోయే సిరీస్‌లలో భారత జట్టుకు మరిన్ని అవమానాలు ఎదురవుతాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ జాబితాలో ముందు వరుసలో వెటరన్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా అతడు తిరిగి భారత వన్డే జట్టులోకి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి వరుసగా ఆరు మ్యాచ్‌లలో ఆడినప్పటికీ, చెప్పుకోదగ్గ ప్రదర్శన అస్సలు చేయలేదు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కాస్తో కూస్తో బ్యాట్‌తో రాణించినప్పటికీ, న్యూజిలాండ్‌పై మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. పేరుకి ఆల్‌రౌండరే కానీ, మూడు వన్డేలలో కలిపి కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. జడేజా కోసం అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టారని, అయితే అతన్ని వన్డే ఫార్మాట్‌లో పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: టైమ్ చూసి చావుదెబ్బ కొట్టారు కదా భయ్యా.! ఇక టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు..

ఇక మరోవైపు కుల్దీప్ యాదవ్. అతని బౌలింగ్‌లో పదును తగ్గినట్లు అనిపిస్తుంది. వన్డేలలో అతడి బౌలింగ్ ప్రభావంతంగా లేదు. కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కేవలం మూడు వికెట్లు మాత్రమే తీశాడు. అందులోనూ కివీస్ బ్యాటర్‌లను ఏమాత్రం ఇబ్బంది పెట్టేలా బౌలింగ్ చేయలేకపోయాడు. దీంతో కుల్దీప్‌ను కూడా జట్టు నుంచి పక్కన పెట్టాల్సిందేనంటున్నారు. మూడో ఆటగాడు ప్రసిద్ధ్ కృష్ణ. అసలు ఇతడు ఎందుకు జట్టులో ఉన్నాడో కూడా తెలియదని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బుమ్రా జట్టులోకి తిరిగి వస్తే ప్రసిద్ధ్ అడ్రస్ లేకుండా పోవడం ఖాయమని చెప్పారు. మరో ఐదు నెలల తర్వాత జూన్ నుంచి భారత జట్టు వన్డే సిరీస్ ఆడనుంది. అప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి ఎంపిక కావడం కష్టమే. కివీస్‌తో జరిగిన తొలి రెండు వన్డేలలో అట్టర్ ఫ్లాప్ అయిన ప్రసిద్ధ్‌ను, మూడో వన్డేలో బెంచ్‌కే పరిమితం చేశారు. ఈ ముగ్గురిని తర్వాత వన్డే సిరీస్‌లకు అసలు ఎంపిక చేయకూడదని, ఒకవేళ అలా చేయకపోతే గంభీర్ తన కోచ్ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవడం మంచిదని మాజీ క్రికెటర్లు అంటున్నారు.

ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

టీమిండియా పాలిట విలన్లు వీరే.! ఆ ముగ్గురు లేకుంటే
టీమిండియా పాలిట విలన్లు వీరే.! ఆ ముగ్గురు లేకుంటే
రెండోసారి ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో టాలీవుడ్ నటి పూర్ణ.. ఫొటోస్
రెండోసారి ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో టాలీవుడ్ నటి పూర్ణ.. ఫొటోస్
హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?