Boyapati Srinu: అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. ఓపెన్‌గా చెప్పేసిన బోయపాటి
దర్శకుడు బోయపాటి శ్రీను తన సినిమా టేకింగ్ గురించి వివరించారు. సరైనోడు చిత్రాన్ని కూడా అల్లు అరవింద్‌కు చివరి వరకు చూపించలేదని తెలిపారు. ఫైనల్ ప్రొడక్షన్ పూర్తయిన తర్వాతే చిత్రాన్ని చూపిస్తానని, అప్పుడే సరైన అంచనా వేయగలరని ఆయన స్పష్టం చేశారు.

టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను తన సినిమా టేకింగ్‌పై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. తన సినిమాలను పూర్తిస్థాయిలో ఫైనల్ ఎడిటింగ్ అయిన తర్వాతే ఎవరికైనా చూపిస్తానని స్పష్టం చేశారు. సరైనోడు సినిమా విషయంలో కూడా నిర్మాత అల్లు అరవింద్‌కు చివరి వరకు సినిమాను చూపించలేదనే విషయం నిజమేనని బోయపాటి శ్రీను తెలిపారు. ఒక సినిమా ఫైనల్ ఎడిటింగ్ పూర్తయి, స్క్రీన్‌ప్లే ప్రకారం అన్ని సీన్లు ఒక గొలుసుకట్టుగా సరిగ్గా అమర్చిన తర్వాతే, ఫైనల్‌గా పూర్తయినట్లు అని.. అది మీ ముందుకు వచ్చినప్పుడు మాత్రమే దానిపై ఒక సరైన అభిప్రాయానికి రాగలమని పేర్కొన్నారు.
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో
కేవలం కొన్ని సన్నివేశాలను మాత్రమే చూస్తే, వాటి మధ్య అనుసంధానం అర్థం కాదని అన్నారు. ఈ ప్రక్రియ దర్శకుడికి పూర్తి స్వేచ్ఛను ఇస్తుందన్నారు. ఫైనల్ ఎడిటింగ్ తర్వాత చూపించినప్పుడు, దర్శకుడిగా తనకు ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే, అవి ఎక్కడ, ఎందుకు చేయాలి అనే దానిపై స్పష్టత ఉంటుందని బోయపాటి తెలిపారు. “సార్ ఇదిగో దీని లింక్ ఇదిగో ఇక్కడ ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఇది చేశాను అని చెప్పడానికి ఉంటది,” అని ఆయన అన్నారు. ఇక చిరంజీవితో చేయడానికి తన దగ్గర సరైన కథ లేదని.. కచ్చితంగా త్వరలోనే మంచి సబ్జెక్ట్‌తో చిరంజీవితో సినిమా చేయగలనని.. బోయపాటి తెలిపారు.
ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




