Tollywood: తెలంగాణ శకుంతల చనిపోయే ముందు చెప్పింది విని ఏడ్చేశా.. ఆమె శవపేటికపై పేరు చూసి
నటుడు శివాజీ రాజా తన కెరీర్‌లోని పలు ఆసక్తికర సంఘటనలను గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దివంగత నటుడు శ్రీహరితో స్నేహం, అలాగే తెలంగాణ శకుంతల బ్యాంకాక్‌లో అనారోగ్యానికి గురైనప్పుడు తాను అందించిన సాయం లాంటివి తెలిపారు. ఆ వివరాలు ఇలా..

టాలీవుడ్ నటుడు శివాజీ రాజా ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలో ఎదురైన పలు ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. దివంగత నటుడు శ్రీహరి స్నేహం, ఆయన మృతి చుట్టూ ఉన్న అనుమానాలు, అలాగే తెలంగాణ శకుంతల ఘటన, కోట శ్రీనివాసరావు లేఖ లాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. శ్రీహరి మృతికి స్నేహితులే కారణమంటూ శాంతి చేసిన వ్యాఖ్యలను శివాజీ రాజా ఖండించారు. తనకూ, శ్రీహరికి మద్యపానం అలవాటున్నా కేవలం ఐదు సార్లు మాత్రమే కలిసి సేవించామని, సిగరెట్ మానమని తాను శ్రీహరిని కోరానని తెలిపారు. వ్యక్తిగత వ్యసనాలను స్నేహితులు బలవంతంగా మాన్పించలేరని, చిరంజీవికి మాట ఇచ్చి తాను సిగరెట్లు మానేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీహరి ఎంతోమందికి ఆర్థిక సాయం చేసి, జీవితాన్ని ఇచ్చిన గొప్ప స్నేహితుడని కొనియాడారు.
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో
మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కోట శ్రీనివాసరావు నుంచి అన్య భాషా నటుల గురించి వచ్చిన లేఖకు తాను ధీటైన సమాధానం ఇచ్చానని శివాజీ రాజా వివరించారు. తమిళం, కన్నడ చిత్రాలలో కోట శ్రీనివాసరావు నటించడం మానేస్తే, పరభాషా నటుల గురించి మాట్లాడవచ్చని తాను బదులిచ్చినట్టుగా తెలిపారు. అంతేకాకుండా దివంగత నటి తెలంగాణ శకుంతల బ్యాంకాక్‌లో షూటింగ్ కోసం వెళ్లినప్పుడు గుండెపోటుకు గురయ్యారని.. అప్పుడు ఆమెకు ఆర్థిక కష్టాలు ఉన్నాయని శివాజీ రాజా గుర్తుచేసుకున్నారు. ‘చిన్న ప్రొడక్షన్ కావడంతో డబ్బుల్లేవ్. హాస్పిటల్‌లో ఉంది. నాకంతంతమాత్రం ఇంగ్లీష్. వారికి అస్సలు ఇంగ్లీష్ రాదు అక్కడ. నేను మధ్యలో ఎవరినో ఒకడిని పట్టుకుని, ‘మీరెందుకు, నేను చూసుకుంటాను, మీరు ముందు ఇక్కడకు రండి, మిగతా అంతా నేను చూసుకుంటాను’ అని చెప్పాను. ఆ సమయంలో ఆమెకు తాను అండగా నిలిచానని గుర్తు చేసుకున్నారు. మరణానంతరం ఆమె శవపేటికపై శివాజీ అనే పేరు కనిపించడం దైవ నిర్ణయంగా భావించానని ఎమోషనల్ అయ్యారు.
ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




