AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Folk Song: బాయిలోనే బల్లిపలికే ఫోక్ సాంగ్‌కు ఎన్ని లక్షలు వచ్చాయంటే.. యూట్యూబ్‌లో ఇప్పుడిదే ట్రెండింగ్

బాయిలోనే బల్లిపలికే పాటతో తెగ పాపులారిటీ సంపాదించిన ఫోక్ సింగర్ నాగవ్వ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పాట తనకు తన అమ్మమ్మ ద్వారా వచ్చిందని, బల్లి పలకడం శుభానికి సంకేతమని వివరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఇది చదవండి..

Telugu Folk Song: బాయిలోనే బల్లిపలికే ఫోక్ సాంగ్‌కు ఎన్ని లక్షలు వచ్చాయంటే.. యూట్యూబ్‌లో ఇప్పుడిదే ట్రెండింగ్
Telugu Folk Song
Ravi Kiran
|

Updated on: Jan 17, 2026 | 8:35 PM

Share

ఫోక్ సింగర్ నాగవ్వ బాయిలోనే బల్లిపలికే పాటతో ఓవర్‌నైట్‌లో స్టార్‌గా ఎదిగింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలు, ఈ పాట పుట్టుక లాంటి విషయాలను పంచుకుంది. జగిత్యాల జిల్లా ఎనాపల్లి మండలం గుళ్ళకోట గ్రామానికి చెందిన నాగవ్వ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. పొలం పనుల అలసటను తీర్చుకోవడానికి, తన చుట్టూ ఉన్న ప్రజలను ఉత్సాహపరచడానికి ఫోక్ సాంగ్స్ పాడటం ఆమెకు అలవాటు. బాయిలోనే బల్లిపలికే పాట నాగవ్వ.. తన అమ్మమ్మ ద్వారా వచ్చిన ఒక సంప్రదాయ పాట అని చెప్పుకొచ్చింది. నాగవ్వ తండ్రి బల్లి పలకడం శుభసూచకమని చెప్పేవారట. ఈ నమ్మకమే పాట పుట్టుకకు కారణమైందని ఆమె చెప్పింది. పూర్వకాలంలో దొంగల భయం వల్ల ప్రజలు తమ బంగారాన్ని, వెండిని బావులలో దాచేవారని, బల్లి పలికిన చోట తవ్వకాలు చేయగా ఆ సంపద బయటపడిందని పాట నేపథ్యమని తెలిపింది.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

నాగవ్వ కొడుకు తిరుపతి రెడ్డి.. ఒక లిరిసిస్ట్, దర్శకుడిగా మారాలని అనుకుంటున్నాడట. అతడు ఈ పాటకు కష్టపడ్డాడని నాగవ్వ తెలిపింది. మంగ్లీ, దామోదర్ రెడ్డిల సాయంతో ‘రాక్షస కావ్యం’ సినిమాలో పాట అవకాశంగా మొదలై.. చివరకు బాయిలోనే బల్లిపలికే ఇండివిడ్యువల్ వీడియోగా రూపొందిందని చెప్పింది. ఈ ఒక్క పాట కోసం మూడేళ్లు వేచి చూశామన్నారు. మంగ్లీ, ఆమె బృందం ఈ పాట కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. రూ.15 లక్షలకు పైగా ఖర్చు పెట్టి సుమారు 150 మంది సాంకేతిక నిపుణులతో అత్యంత గ్రాండ్‌గా నిర్మించామని చెప్పింది. కేవలం మూడు రోజులలో షూటింగ్ పూర్తీ చేశామని.. తాము అనుకున్న దానికంటే ఎక్కువగానే పాపులారిటీ ఈ పాటకు వచ్చిందని తెలిపింది. విడుదలైన నెల రోజులకే 70 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.. రోజుకు 1 మిలియన్ వస్తోందని.. పెట్టుబడి దాదాపుగా తిరిగొచ్చేసిందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను..
నా పెళ్లి అయ్యేలోపు అమ్మను మరో పెళ్లి చేసుకోమని అడిగాను..
ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..
కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..
పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు
పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు
ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసుకోవాల్సిందే
ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసుకోవాల్సిందే
రూ. 34 వేల జీతం వచ్చే వ్యక్తి నెలకు ఎంత SIP పెట్టొచ్చు.!
రూ. 34 వేల జీతం వచ్చే వ్యక్తి నెలకు ఎంత SIP పెట్టొచ్చు.!
'ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో'.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్
'ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో'.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్
ఫ్లాపుల నుంచి బయటపడడానికి పెద్ద ప్లానే వేసిన మెగా ప్రిన్స్
ఫ్లాపుల నుంచి బయటపడడానికి పెద్ద ప్లానే వేసిన మెగా ప్రిన్స్
దేశంలో 4 రకాల హిందువులు ఉన్నారుః మోహన్ భగవత్
దేశంలో 4 రకాల హిందువులు ఉన్నారుః మోహన్ భగవత్