Chiranjeevi: అన్నయ్య మనసు బంగారం.! చిరంజీవి వల్లే ఈరోజు బ్రతికి ఉన్నానంటున్న నటుడు..
ప్రముఖ విలన్, స్టంట్ మాస్టర్ పొన్నాంబళం తన కిడ్నీ సమస్యల సమయంలో మెగాస్టార్ చిరంజీవి అందించిన సాయాన్ని గుర్తు చేస్తూ.. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆపదలో ఉన్నప్పుడు చిరంజీవి చేసిన సాయాన్ని దైవంతో సమానంగా భావిస్తున్నానని.. ఆయన అండతోనే తాను కోలుకొని బ్రతికానని పొన్నాంబళం తెలిపాడు.

ప్రముఖ విలన్, స్టంట్ మాస్టర్ పొన్నాంబళం గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చేసిన సాయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయన కాపాడటం వల్లే తాను ఈరోజు ఇలా ఉన్నాయని తెలిపాడు. ఐదు భాషల్లో 1500 సినిమాలకు పైగా స్టంట్ మాస్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, విలన్‌గా పని చేసిన పొన్నాంబళం.. తాను శివుడి భక్తుడినని చెప్పాడు. చిన్నతనం నుంచే తనకు భగవంతుడిపై నమ్మకం ఉందన్నాడు. షూటింగ్‌లలో రిస్క్ షాట్స్ చేసేటప్పుడు కూడా హనుమంతుడిని తలుచుకుంటానని తెలిపాడు.
ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’
కిడ్నీ వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు చాలా కృంగిపోయానని పొన్నాంబళం చెప్పాడు. వ్యాపారాలు నష్టపోయి, ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ప్రార్థించానని, సాయం కోసం ఎదురు చూశానని చెప్పాడు. ఆ క్షణంలోనే తనకు మెగాస్టార్ చిరంజీవి గుర్తొచ్చారని చెప్పాడు. చిరంజీవికి ఒక మెసేజ్ పంపగానే, ఆయన నేపాల్‌లో షూటింగ్‌లో ఉన్నప్పటికీ, ‘నేను వచ్చి మాట్లాడతాను’ అని బదులిచ్చారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకే చిరంజీవి నుంచి ఫోన్ వచ్చిందని, ‘బాధపడొద్దు, నేనున్నాను. నువ్వు తొందరగా అపోలో హాస్పిటల్‌కి వెళ్ళు, అన్ని ఫైల్స్ తీసుకుని వెళ్ళు’ అని భరోసా ఇచ్చారని పొన్నాంబళం గుర్తు చేసుకున్నాడు. కిడ్నీ మార్చాలని డాక్టర్లు చెప్పగానే భయపడ్డానని తెలిపాడు. టెన్షన్ పడకండి.! తాము చూసుకుంటామన్నారు. తన వద్ద అప్పుడు కేవలం పది లక్షలు మాత్రమే ఉన్నప్పటికీ, చిరంజీవి సాయంతో తాను ధైర్యంగా ఉన్నానని చెప్పాడు.
చిరంజీవి తన పాలిట దేవుడని పొన్నాంబళం వివరించాడు. ఒక మనిషి మరొకరికి సాయం చేసినప్పుడు, ఆ సహాయం చేసే వ్యక్తిని దేవుడిలా చూస్తామని అన్నాడు. తన భార్యాపిల్లలు కూడా చేయలేని సాయాన్ని చిరంజీవి చేశారని, ఆయనకు కృతజ్ఞతతో ఉంటానన్నాడు. చిరంజీవి చేసిన సాయం తన జీవితానికి కొత్త ఊపిరి పోసిందని.. అందుకే ‘చిరంజీవి వల్లే బ్రతికి ఉన్నా’ అని తెలిపాడు.
ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




