AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అల్లు అర్జున్ మాటిచ్చాడు.. అందుకే ఎదురుచూస్తున్నా.! ఆ సినిమాల వల్ల 100 కోట్ల ఆస్తులు అమ్మేశా..

ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల తన సినీ ప్రస్థానం, ఆర్ధిక కష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు తెలిపాడు. కీర్తి సురేశ్‌ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది తానేనని పేర్కొన్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Tollywood: అల్లు అర్జున్ మాటిచ్చాడు.. అందుకే ఎదురుచూస్తున్నా.! ఆ సినిమాల వల్ల 100 కోట్ల ఆస్తులు అమ్మేశా..
Chanti Addala
Ravi Kiran
|

Updated on: Jan 17, 2026 | 9:34 PM

Share

టాలీవుడ్ సినీ నిర్మాత చంటి అడ్డాల తన కెరీర్‌లో ఎదురైన కష్టాలు, నష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఇండస్ట్రీలో ఆర్ట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి.. దర్శకుడు గుణశేఖర్ ‘యూరోఫియా’, ‘లాఠీ’ చిత్రాలకు, అలాగే ఈ.వి.వి సత్యనారాయణ తొలి చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత చంటి అడ్డాల పలు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా తన చివరి రెండు సినిమాలు భారీ నష్టాలను మిగిల్చాయని తెలిపాడు. కీర్తి సురేశ్‌ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది తానేనని చెప్పాడు. నరేష్ కుమారుడు నవీన్ హీరోగా నటించిన ఆ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకున్నా.. విడుదల కాలేదని పేర్కొన్నాడు. ఆ చిత్రం కోసం అప్పట్లో ఖర్చు చేసింది తక్కువైనా, దాని కోసం దాదాపు 70-80 కోట్ల(లేటెస్ట్ లెక్కలు) విలువైన ఆస్తులను అమ్మేయాల్సి వచ్చిందని అన్నాడు. ఆ సమయంలో సుమారు 15 కోట్ల నష్టం వాటిల్లిందని, అది తన స్థాయికి పెద్ద భారమని ఆవేదన వ్యక్తం చేశాడు. “లాస్ట్ ఊరు” అనే మరో చిత్రం కూడా నష్టాలనే మిగిల్చిందని తెలిపాడు.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

అల్లు అర్జున్‌తో తనకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉందని చంటి అడ్డాల అన్నాడు. అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి తనకు తెలుసని, అల్లు అరవింద్ దగ్గరి నుంచి కూడా తమ కుటుంబాలకు పరిచయం ఉందని వివరించాడు. గత 7-8 సంవత్సరాలుగా అల్లు అర్జున్‌తో కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తున్నానని, ఏదో ఒక పెద్ద నిర్మాణ సంస్థలో తనను భాగస్వామిని చేస్తానని అల్లు అర్జున్ హామీ ఇచ్చాడని తెలిపాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం వందల కోట్ల బడ్జెట్ సినిమాలను చేస్తున్న నేపథ్యంలో, తాను స్వతంత్రంగా అలాంటి చిత్రాలను నిర్మించలేనని, అందుకే ఆయన హామీ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఒక కొత్త ప్రాజెక్ట్‌ను నిర్మాత దిల్ రాజుతో కలిసి ప్లాన్ చేస్తున్నానని చంటి అడ్డాల వెల్లడించాడు. ఈ ప్రాజెక్ట్ తుది దశలో ఉందని, దిల్ రాజు త్వరలో దీనిని అధికారికంగా ప్రకటిస్తారని తెలిపాడు. కొత్త దర్శకులకు, మంచి కంటెంట్ ఉన్న చిన్న కథలకు తాను ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతానని, ఇప్పటికే చాలా మంది కథలు వినిపించడానికి వస్తున్నారని తెలిపాడు. సినిమా అంటే కేవలం డబ్బు సంపాదన మాత్రమే కాదని, దాని పట్ల ఉన్న ప్యాషన్, ప్రేమతోనే సినిమాలు తీస్తామని, అయితే ఆర్ధికంగా విజయం సాధించడం కూడా అవసరమేనని అభిప్రాయపడ్డాడు.

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..