Manaswini Balabommala: కొక్కోరోకో సినిమాతో ఎంట్రీ ఇస్తున్న మనస్విని బాలబొమ్మల.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్..
సినీరంగంలోకి కొత్తతరం నటీనటులు ఎంట్రీ ఇస్తున్నారు. తమ ప్రతిభతో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగ మనస్విని బాలబొమ్మల తెలుగులోకి అరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యారు. “కొక్కోరోకో” చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటుంది. అలాగే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

థియేటర్ రంగంలో మంచి అనుభవం ఉన్న అమ్మాయి మనస్విని బాలబొమ్మల. సినిమాల్లోకి రాకముందే మనస్విని ఒక శిక్షణ పొందిన, బహుముఖ ప్రతిభ కలిగిన కళాకారిణిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. థియేటర్ రంగంలో Little Women నాటకంలో జోగా, Much Ado About Nothing లో బియాట్రిస్‌గా ప్రధాన పాత్రలు పోషించి తన నటనతో మెప్పించింది. నటనతో పాటు ఆమెకు పెరిని నాట్యం అనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉండగా, కర్ణాటక సంగీతంలోనూ ప్రావీణ్యం సాధించారు. భక్తి గీతాల ప్రదర్శనలు ఇవ్వడం, గ్లెండేల్ అకాడమీ లో ప్రధాన పాఠశాల కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడం కూడా ఆమె కళా ప్రయాణంలో భాగమే, ఇవన్నీ ఆమె స్టేజ్ ప్రెజెన్స్‌ను ప్రతిబింబిస్తాయి.
యువతరం లో మంచి గుర్తింపు సాధించే ప్రతిభావంతురాలైన మనస్విని బాలబొమ్మల తెలుగులో “కొక్కోరోకో” చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆమె కళాత్మక ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ తన సున్నితమైన, సంప్రదాయాత్మక భావంతో వెంటనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ పోస్టర్‌పై “Our Bangarraju Family wishes you and your family a Happy Sankranthi. ‘కొక్కోరోకో’ త్వరలో థియేటర్లలో” అనే సందేశం ఉంచి, చిత్రానికి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు.
ఈ సంక్రాంతి పోస్టర్ ద్వారా మనస్విని బాలబొమ్మల తొలి అధికారిక లుక్ కూడా విడుదలైంది. ఆ పోస్టర్‌లో ఆమె సీనియర్ నటుడు సముద్రఖని సహా ఇతర నటులతో కలిసి కనిపించారు. ఈ చిత్రంలో ఆమెది అతిథి పాత్ర అయినప్పటికీ, ఇది తెలుగు సినిమాల్లో ఆమెకు అధికారిక ఆరంభంగా నిలవడం తో పాటు, ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి స్పందనను రాబడుతోంది. “కొక్కోరోకో” చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ తన కొత్త బ్యానర్ ఆర్వీ ఫిల్మ్ హౌస్ ద్వారా తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ వసంతల దర్శకత్వం వహిస్తున్నారు. ఐదు విభిన్న పాత్రలతో కూడిన ఈ సంకలిత చిత్రం, సంప్రదాయ కోడిపందేల నేపథ్యాన్ని ప్రధానంగా తీసుకుంది. రేఖా వర్మ, కురపాటి సిరీష నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, నీలాద్రి ప్రొడక్షన్ పతాకంపై 2026లో విడుదలకు సిద్ధమవుతోంది.
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..
