AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: డబ్బు కోసం నన్ను అలా.. నా భర్త సీక్రెట్‌గా 9 మందితో ఎఫైర్ పెట్టుకున్నాడు..

సీనియర్ నటి పూజిత తన వివాహ జీవితంలోని చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. తండ్రి మాట నిలబెట్టుకోవడం కోసం 18 ఏళ్లు మోసపూరిత బంధాన్ని భరించానని తెలిపింది. భర్త అప్పులు, మోసం, బంగారం దొంగతనం, ఎఫైర్స్ లాంటి విషయాల గురించి పేర్కొంది.

Tollywood: డబ్బు కోసం నన్ను అలా.. నా భర్త సీక్రెట్‌గా 9 మందితో ఎఫైర్ పెట్టుకున్నాడు..
Tollywood
Ravi Kiran
|

Updated on: Jan 17, 2026 | 9:14 PM

Share

సీనియర్ నటి పూజిత తన వివాహ జీవితంలో ఎదుర్కున్న ఇబ్బందులను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. నటిగా తాను ఫేస్ చేసిన సవాళ్లు, తన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఆమె పడిన కష్టాలు గురించి పేర్కొంది. పెళ్లి అయిన మూడు నాలుగు రోజులకే తన భర్త విజయ గోపాల్ అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయాన్ని పూజిత గుర్తు చేసుకుంది. ఓ ప్రముఖ సంస్థలో పనిచేసిన అతడు డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. భర్త వ్యసనాలకు బానిస కావడంతో పాటు, ఇంట్లో ఉన్న రెండున్నర కోట్ల విలువైన బంగారం, నగదును కూడా దొంగిలించుకుపోయాడు. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం 18 సంవత్సరాలు ఈ బంధాన్ని భరించినట్లు పూజిత తెలిపింది. తన కుమారుడి భవిష్యత్తు కోసం కష్టపడి నిలబడిన ఆమె.. తన కళ్ళలో కన్నీళ్లు ఇంకిపోయాయని పేర్కొంది.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

ఆర్థిక మోసాలతో పాటు తన భర్త సోషల్ మీడియా ద్వారా తొమ్మిది మంది మహిళలతో ఎఫైర్లు పెట్టుకున్నాడని పూజిత ఆరోపించింది. ఒకరోజు తాను షూటింగ్ నుంచి అలసి వచ్చి పడుకున్నప్పుడు.. భర్త ఫోన్లో పావని అనే మహిళ నుంచి వచ్చిన బెడ్‌రూమ్ సంబంధిత మెసేజ్‌లను చూసి ఈ విషయం తనకు తెలిసిందని ఆమె వివరించింది. తన తండ్రి మరణించిన తర్వాత తనలో ఉన్న దుఃఖం అంతా వెళ్లిపోయిందని, కన్నీళ్లు ఇంకిపోయాయని ఆమె పేర్కొంది. తన తండ్రి ‘అబ్బాయిలా’ పెంచాడని, ఆయనకు ఇచ్చిన మాట కోసం, బిడ్డ భవిష్యత్తు కోసం కష్టాలను భరించి నిలబడ్డానని పూజిత స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
ఒకప్పుడు విడాకుల కోసం కోర్లు మెట్లెక్కిన కిచ్చా సుదీప్ దంపతులు
ఒకప్పుడు విడాకుల కోసం కోర్లు మెట్లెక్కిన కిచ్చా సుదీప్ దంపతులు
గనులు లేని దేశం.. బంగారంలో మాత్రం ప్రపంచంలోనే టాప్!
గనులు లేని దేశం.. బంగారంలో మాత్రం ప్రపంచంలోనే టాప్!
ఈ బ్యాంకుపై ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రూ.5,000 మాత్రమే విత్‌డ్రా
ఈ బ్యాంకుపై ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రూ.5,000 మాత్రమే విత్‌డ్రా
తొలి పోరుకు టీమిండియా రెడీ.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
తొలి పోరుకు టీమిండియా రెడీ.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
100 స్థానాల్లో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. కూటమి పార్టీల స్పందన
100 స్థానాల్లో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. కూటమి పార్టీల స్పందన
పాశాంకుశ ఏకాదశి.. ఈ వ్రతం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం! పూజా విధానం
పాశాంకుశ ఏకాదశి.. ఈ వ్రతం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం! పూజా విధానం
కాళ్లు, చేతులు ఉబ్బుతున్నాయా? శరీరంలో నీరు నిల్వ ఉండటానికి కారణం!
కాళ్లు, చేతులు ఉబ్బుతున్నాయా? శరీరంలో నీరు నిల్వ ఉండటానికి కారణం!
ఓటీటీలోకి వచ్చేసిన నాని సూపర్ హిట్ సినిమా 'ది ప్యారడైజ్'
ఓటీటీలోకి వచ్చేసిన నాని సూపర్ హిట్ సినిమా 'ది ప్యారడైజ్'
ఘోర రోడ్డు ప్రమాదం.. భవానీ భక్తులను ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. భవానీ భక్తులను ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..