AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ నటుడు

నటుడు శివాజీ రాజా ఖడ్గం సినిమా అనుభవాలను, రవితేజ-కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! అనే విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అమృతం సీరియల్ నుంచి తాను వైదొలగడానికి వెనుక కారణాలను తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

Raviteja: రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ నటుడు
Ravi Teja And Krishna Vamsi
Ravi Kiran
|

Updated on: Jan 18, 2026 | 2:11 PM

Share

నటుడు శివాజీ రాజా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఖడ్గం సినిమా షూటింగ్ అనుభవాలు, రవితేజ-కృష్ణవంశీ మధ్య విభేదాలు, అమృతం సీరియల్ నుంచి వైదొలగడం లాంటి అంశాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఖడ్గం సినిమాలోని ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని గుర్తుచేసుకుంటూ.. తాను ఆ పాత్ర చేయడానికి మొదట నిరాకరించానని తెలిపారు. అయితే, దర్శకుడు కృష్ణవంశీ పట్టుబట్టడంతో ఆ పాత్రను అంగీకరించానని చెప్పారు. ఆ సన్నివేశం షూటింగ్ సమయంలో, ప్రకాష్ రాజ్, రవితేజ, శ్రీకాంత్‌లతో కలిసి తాను నవ్వుతూ ఉండగా, కృష్ణవంశీ కోప్పడ్డారని వివరించారు. ఒకే షాట్లో షూటింగ్ పూర్తి చేశారని ఆయన తెలిపారు. ఈ సినిమా ద్వారా తనకు లభించిన గుర్తింపు కృష్ణవంశీకే దక్కుతుందని శివాజీ రాజా పేర్కొన్నారు. ఖడ్గం సినిమాలోని ‘శాంతి శాంతి అని చెప్పి మమ్మల్ని ఆపుతున్నారు కానీ, రెండే రెండు నిమిషాలు ఆపి వదిలి చూడండి’ అనే డైలాగ్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా సర్జికల్ స్ట్రైక్స్ లాంటి సందర్భాల్లో చర్చనీయాంశమవుతుందని ఆయన గుర్తుచేశారు.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోవడం లేదనే ప్రశ్నకు శివాజీ రాజా స్పందిస్తూ.. వారిద్దరూ తనకు మంచి స్నేహితులని, వారి మధ్య ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు. అది తన వ్యక్తిగత విషయం కాదని, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తాను ఊహాగానాలతో సమాధానం చెప్పలేనని అన్నారు. అమృతం సీరియల్ నుంచి వైదొలగడానికి కారణాలు ఉన్నాయన్నారు. సీరియల్ హిట్ అయిన తర్వాత ఈగో సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. ఒక హిట్ వచ్చినప్పుడు ఇది నా వల్ల అని అనుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని అభిప్రాయపడ్డారు. తాను డబ్బింగ్ చెప్పడం ఆలస్యమైందని, తనపై టీమ్ నుంచి ఒక ప్రమోషన్ విడుదలైందని తెలిపారు. అప్పటి వయస్సులో ఉన్న ఒత్తిడులు, సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్స్ వల్ల కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చని, అయితే తన తప్పు 1 శాతం కూడా లేదని ఆయన నొక్కి చెప్పారు. దర్శకుడు గంగరాజు, కెమెరామెన్ సెంథిల్, చంద్రశేఖర్ ఏలేటి లాంటి టీమ్ సభ్యుల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని తెలిపారు. తన ఇంప్రొవైజేషన్ వల్ల గంగరాజు నొచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని, ఆయన రచనలో ఆయన గొప్ప అయితే, తన ప్రొఫెషన్‌లో తాను గొప్ప అని భావించానని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..