వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లు.. 117 బంతుల్లో బౌలర్లకు బడితపూజ.. ఎవరంటే.?
Under-19 World Cup 2026: అండర్-19 ప్రపంచకప్ 2026లో ఇంగ్లాండ్ యువ సంచలనం బెన్ మేయస్ రెచ్చిపోయాడు. స్కాట్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 191 పరుగులతో సరికొత్త చరిత్ర నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్ అండర్-19 హిస్టరీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్ గా నిలిచాడు.

Ben Mayes Fastest U19 Century: జింబాబ్వేలో అండర్-19 ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచ్‌లు జరగుతున్నాయి. ఇందులో భాగంగా హరారే వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ మేయస్ బీభత్సం సృష్టించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న స్కాట్లాండ్ జట్టుకు ఈ యంగ్ ప్లేయర్ చుక్కలు చూపించాడు. 3వ ఓవర్‌లోనే ఓపెనర్ ఔట్ అవ్వడంతో.. క్రీజులోకి వచ్చిన 18 ఏళ్ల మేయస్.. మొదటి బంతి నుంచే దూకుడు ఆరంభించాడు. కేవలం 65 బంతుల్లోనే శతకం కొట్టేశాడు. దీంతో ఇంగ్లాండ్ అండర్-19 చరిత్రలో పాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు.
9 పరుగుల దూరంలో డబుల్ సెంచరీ మిస్..
ఈ ఇన్నింగ్స్‌లో బెన్ మేయస్ 18 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో 117 బంతుల్లో 191 పరుగులతో దూకుడుగా బ్యాటింగ్ చేసిన మేయస్ కేవలం 9 పరుగుల దూరంలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. దీంతో డాన్ లారెన్స్ (174) పేరుతో ఉన్న రికార్డును మేయస్ బ్రేక్ చేశాడు. అండర్-19 ప్రపంచకప్ హిస్టరీలో ఇది ఉమ్మడిగా 2వ అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. శ్రీలంక ప్లేయర్ విరాన్ చాముదిత (192) రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు.
ఇంగ్లాండ్ భారీ విజయం..
Ben Mayes leads the charge for England with a scintillating 65-ball century 💯🔥
Follow the #U19WorldCup action LIVE, broadcast details 👉 https://t.co/jKX6xmmOJQ pic.twitter.com/z9c62UN3c2
— ICC (@ICC) January 21, 2026
మేయస్ బీభత్సంతోపాటు జో మూర్స్ (81) ఆకట్టుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 404 పరుగుల భారీ స్కోర్ చేసింది. అండర్-19 ప్రపంచకప్ హిస్టరీలో ఇది 6వ భారీ స్కోరు కావడం గమనార్హం. మేయస్, మూర్స్ మధ్య 2వ వికెట్‌కు 188 పరుగుల పార్ట్ నర్ షిప్ వచ్చింది.
చిత్తుగా ఓడిన స్కాట్లాండ్..
405 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు, ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి చిత్తుగా ఓడిపోయింది. 152 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 252 పరుగుల భారీ తేడాతో స్కాట్లాండ్ జట్టు ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో కాలేబ్ ఫాల్కనర్ 19 పరుగులిచ్చి 3 వికెట్లతో చెలరేగాడు. ఈ విజయంతో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ సి లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. అలాగే, సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




