కాస్త పుల్లగా.. మరికాస్త తియ్యగా.. ఉండే జామ పండ్లు దాదాపు అన్ని కాలాల్లో అందుబాటులో ఉంటాయి. వీటిని రోజూ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
జామపండులో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా శరీర బరువును అదుపులో ఉంచడంలో కూడా జామపండు మనకు సహాయపడుతుంది
TV9 Telugu
దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి త్వరగా వేయకుండా ఉంటుంది. దీంతో శరీర బరువు అదుపులో ఉంటుంది
TV9 Telugu
జామపండును తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. జామపండు తక్కువ గ్లైసెమిక్ స్థాయిలను కలిగి ఉంటుంది
TV9 Telugu
కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా ఈ పండును తీసుకోవచ్చు. జామపండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కనుక దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షలు త్వరగా మన దరి చేరకుండా ఉంటాయి
TV9 Telugu
ఆయుర్వేదం ప్రకారం జామపండును పగటిపూట మాత్రమే తీసుకోవాలి. ఉదయం లైట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంతరం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది
TV9 Telugu
అలాగే పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయి. అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన 2 గంటల తరువాత ఈ పండును తీసుకోవడం మంచిది
TV9 Telugu
అయితే భారీ భోజనం చేసిన తరువాత జామపండును తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఖాళీ కడుపుతో పండని, గట్టిగా ఉండే జామకాయలను అస్సలు తీసుకోకూడదు