ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 3 కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి!
వచ్చే వారం మూడు కొత్త స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. మోటోరోలా సిగ్నేచర్ జనవరి 23న, వివో ఎక్స్200టీ జనవరి 27న, రియల్మీ పీ4 పవర్ 5జీ జనవరి 29న లాంచ్ అవుతాయి. ఈ ఫోన్ల ధరలు, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

అవి కాకుండా ఇంకా అదిరిపోయే ఫీచర్లు ఎన్నో మూడు ఫోన్లలోనూ ఉన్నాయి. ఇంతకీ ఏ ఫోన్ ఎప్పుడు లాంచ్ కాబోతుందంటే.. జనవరి 23న మోటోరొలా సిగ్నేచర్, 27న వివో ఎక్స్200టీ, 29న రియల్మీ పీ4 పవర్ 5జీ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. మరి ఈ ఫోన్ల ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయంటే..
- కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్న వారికి గుడ్న్యూస్. వచ్చే వారం . మోటోరొలా, వివో, రియల్మీ వంటి ప్రముఖ కంపెనీల నుంచి మూడు కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. వీటిలో రెండు ఫోన్లలో కెమెరా హైలెట్ అయితే మరో ఫోన్లో బ్యాటరీ హైలెట్గా నిలుస్తోంది.
- అవి కాకుండా ఇంకా అదిరిపోయే ఫీచర్లు ఎన్నో మూడు ఫోన్లలోనూ ఉన్నాయి. ఇంతకీ ఏ ఫోన్ ఎప్పుడు లాంచ్ కాబోతుందంటే.. జనవరి 23న మోటోరొలా సిగ్నేచర్, 27న వివో ఎక్స్200టీ, 29న రియల్మీ పీ4 పవర్ 5జీ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. మరి ఈ ఫోన్ల ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయంటే..
- మోటోరొలా కొత్తగా సిగ్నేచర్ పేరిట కొత్త సిరీస్ను లాంచ్ చేయబోతోంది. ఇందుతో తొలి ఫోన్ను ఈ నెల 23న తీసుకురానుంది. ఇది మొత్తం నాలుగు 50 ఎంపీ కెమెరాలతో (బ్యాక్ కెమెరా 3+ 1 సెల్ఫీ కెమెరా) వస్తుండడం విశేషం. స్నాప్ డ్రాగన్ 8జెన్ ప్రాసెసర్, 165Hz ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోంది. ప్రీమియం ప్రాసెసర్, ప్రీమియం కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.50వేల పైమాటే ఉండొచ్చని టెక్ వర్గాల అంచనా.
- వివో తన ఎక్స్ సిరీస్లో X200Tని లాంచ్ చేయనుంది. ఎక్స్ సిరీస్ అంటేనే ప్రీమియం ఫోన్లకు, కెమెరాకు పెట్టింది పేరు. మరోసారి ఈ రెండింటినీ ఫోకస్ చేస్తూ ఎక్స్200టీ కొత్త ఫోన్ను తీసుకొస్తోంది. ఇది జీస్ పార్ట్నర్షిప్తో వస్తుండడం విశేషం. రూ.50-60 వేల మధ్య తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో ట్రిపుల్ 50 ఎంపీ కెమెరాతో పాటు, మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రొసెసర్ ఇవ్వనున్నారు. 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 6200 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ రాబోతోంది.
- ఇక రియల్మీ పీ4 పవర్ 5జీ బిగ్ బ్యాటరీతో వస్తుంది. దేశంలోనే తొలిసారిగా 10,001 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ను తీసుకొస్తుండడం విశేషం. ఇందులో 144Hzడిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఇవ్వనున్నారు. దీని ధర కూడా రూ.30 వేలు ఉండొచ్చని టెక్ వర్గాల అంచనా.





