తెలుగులో బిజీగా మారిన కన్నడ కస్తూరి శ్రీనిధి శెట్టి 

Rajeev 

22 January 2026

 శ్రీనిధి శెట్టి మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి ఆతర్వాత మిస్ సుప్రనేషనల్ 2016 విజేత. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తుంది.

2015లో మిస్ కర్ణాటక , మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లను, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది.

మిస్ సుప్రనేషనల్ 2016లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించి, ఈ టైటిల్‌ను గెలుచుకున్న రెండో భారతీయురాలైంది.

2018లో కన్నడ చిత్రం KGF: ఛాప్టర్ 1లో రీనా దేశాయ్ పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది.

KGF: ఛాప్టర్ 2 లో కూడా ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. రీసెంట్ గా తెలుగులోకి అడుగుపెట్టింది.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

 అలాగే తెలుసు కదా అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.