ఆహారంలో భాగంగా పచ్చి కొబ్బరి తీసుకోవడం మనందరికీ అలవాటే. దీనిని నేరుగా తినడంతో పాటు వివిధ వంటకాల్లో కూడా వినియోగిస్తుంటాం
TV9 Telugu
పచ్చి కొబ్బరి రుచికి తియ్యగా, వంటకాలు కూడా ప్రత్యేక రుచిని తీసుకువస్తుంది. ఇందులో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి
TV9 Telugu
పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బరువు తగ్గడంలో, చర్మానికి, జుట్టుకు ప్రయోజనాలను చేకూర్చడంలో దోహదపడుతుంది
TV9 Telugu
అయితే డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు పచ్చి కొబ్బరిని తీసుకోవచ్చా.. లేదా? అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడే వారు పచ్చికొబ్బరిని తీసుకుంటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం
TV9 Telugu
పచ్చికొబ్బరిలో తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉంటుంది. కనుక డయాబెటిస్ తో బాధపడే వారు దీనిని తీసుకోవచ్చు. అయితే తక్కువ మొత్తంలో మాత్రమే తీసుకోవాలి
TV9 Telugu
పచ్చికొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా ఉంటాయి
TV9 Telugu
అంతేకాకుండా డయాబెటిస్ తో బాధపడే వారు పచ్చికొబ్బరిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటి మెరుగుపడుతుంది
TV9 Telugu
కాబట్టి డయాబెటిస్ తో బాధపడే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చికొబ్బరిని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలల్లో వచ్చే ఆకస్మిక హెచ్చుతగ్గులు కూడా అదుపులో ఉంటాయి