- Telugu News Photo Gallery Cinema photos Young actress kakinada sridevi shred her birthday photos on instagram
బ్యూటీ ఫుల్ బర్త్ డే గర్ల్.. క్యూట్ ఫోటోలను షేర్ చేసిన కోర్ట్ మూవీ భామ శ్రీదేవి
సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రభాస్ ఫౌజి హీరోయిన్ ఇమాన్వీ, ఆర్జీవీ శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి, పుష్ప 2 ఆంచల్ ముంజాల్, ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య అలా వచ్చిన వారే..
Updated on: Dec 23, 2025 | 4:32 PM

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రభాస్ ఫౌజి హీరోయిన్ ఇమాన్వీ, ఆర్జీవీ శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి, పుష్ప 2 ఆంచల్ ముంజాల్, ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య అలా వచ్చిన వారే..

వారిలానే సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది శ్రీదేవి. కోర్ట్ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఈ చిన్నది. కోర్ట్ సినిమాలో జాబిలి అనే పాత్రలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

ఈ బ్యూటీ పూర్తి పేరు శ్రీదేవి ఆపళ్ల. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ లో జన్మించింది ఈ అమ్మడు. శ్రీదేవి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ రీల్ చూసి కోర్ట్ సినిమాలో ఆమెకు అవకాశం కల్పించారట దర్శక నిర్మాతలు. ఈ విషయాన్ని కోర్టు మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇదిలా ఉంటే కోర్టు సినిమా తర్వాత ఇప్పుడు మరో తెలుగు సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఈ ముద్దుగుమ్మ మరో క్రేజీ ఆఫర్ అందుకుందని తెలుస్తుంది. తమిళ్ లోనూ ఓ సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ రానున్నాయి.

కాగా ఇటీవల ఈ అమ్మడి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పంచుకుంది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది ఈ అందాల భామ.




