- Telugu News Photo Gallery Cinema photos Will Bhagyashree Borse play the heroine in Tamil star hero Suriya's movie
లక్ అంటే ఈ అమ్మడిదే..! ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ..
టాలీవుడ్ లో తన అందంతో కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. వారిలో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ అమ్మడు .
Updated on: Dec 23, 2025 | 4:27 PM

టాలీవుడ్ లో తన అందంతో కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. వారిలో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ అమ్మడు.

తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ సినిమా ఫ్లాప్ అయినా.. ఈ అమ్మడి అందానికి మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది ఈ అందాల భామ. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం సాధించలేదు.

ఆతర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కింగ్‌డమ్ అనే సినిమా చేసింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడులైంది కానీ సినిమాకు అంతగా ఆదరణ లభించలేదు. అయినా కూడా ఈ అమ్మడికి ఆఫర్స్ మాత్రం తగ్గలేదు. ఆవెంటనే రామ్ పోతినేని సినిమాలో ఛాన్స్ అందుకుంది.

యంగ్ హీరో రామ్ పోతినేనితో కలిసి ఆంధ్రా కింగ్ తాలూకా అనే సినిమా చేసింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ తన అందంతో ఆకట్టుకుంది. ఆతర్వాత దుల్కర్ సల్మాన్‌తో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం కాంతలో నటించి మెప్పించింది ఈ వయ్యారి భామ.

ఇప్పుడు ఈ అమ్మడు తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాలో ఛాన్స్ అందుకుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.




