- Telugu News Photo Gallery Cinema photos TV actress Kavya shree beautiful photos go viral on social media
పచ్చని చెట్ల మధ్య పరికిణిలో.. కావ్యా అందాలు చూడతరమా..
అందాల ముద్దుగుమ్మ కావ్యా శ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ ఎప్పుడూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది పచ్చని చెట్ల మధ్య పరికిణిలో తన అందాలతో అందరి మనసు దోచేసింది.
Updated on: Dec 23, 2025 | 1:43 PM

బుల్లితెర ముద్దుగుమ్మ కావ్య శ్రీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు గోరింటాకు సీరియల్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అందం, అభినయంతో తెలుగు అభిమానుల మనసు దోచుకుని, అందరి ఫేవరెట్ అయిపోయిది.

ఈ ముద్దుగుమ్మ గోరింటాకు సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి, మొదటి సీరియల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక సీరియల్ తర్వాత అనేక అవకాశాలు తలపు తట్టడంతో చాలా సీరియల్స్‌లో నటించి, సీరియల్ ప్రేమికుల మనసులో మంచి స్థానంసంపాదించుకుంది. గోరింటాకు సీరియలే కాకుండా చిన్నీ సీరియల్‌తో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇక ఈ మధ్య ఈ బ్యూటీ సీరియల్స్ లోనే కాకుండా పలు షోలలో కూడా యాక్టి్వ్‌గా పాల్గొంటూ సందడి చేస్తుంటుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా తన అంద చందాలతో అందరినీ కట్టిపడేతస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ చిన్నది పరికిణిలో, అందమైన ఆడపిల్లలా పచ్చని చెట్ల మధ్య ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్‌ను ప్రేమించిన విషయం తెలిసిందే. దాదాపు 5 సంవత్సరాలు ప్రేమలో ఉన్న వీరు, బిగ్ బాస్‌కు వెళ్లడానికి కొన్ని రోజుల ముందే వారు విడిపోయినట్లు అనేక వార్తలు వచ్చాయి. ఇక ఆ సమయంలో ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది. ప్రస్తుతం వీరు విడిపోయి, వారి కెరీర్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.



