రాజస్థాన్లోని జాలౌర్ జిల్లాలో 15 గ్రామాల్లో కోడళ్లు, యువతులు స్మార్ట్ఫోన్లు వాడటం నిషేధమని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 26 నుండి అమలులోకి వచ్చే ఈ ఆదేశం ప్రకారం, మహిళలు కీప్యాడ్ ఫోన్లు మాత్రమే వినియోగించాలి. గాజీపూర్ గ్రామంలో జరిగిన ఒక వర్గ సమావేశంలో ఈ నిబంధన విధించారు.