పోషకాలు దండిగా ఉండే ఆహారాల్లో గుడ్డు ముందు వరుసలో ఉంటుంది. అన్ని వయసుల వారికి అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే సమతులాహారం గుడ్డు
TV9 Telugu
మెదడు పని తీరు నుంచి ఎముకల పటుత్వాన్ని, చర్మ సౌందర్యాన్ని, అన్నిరకాల రోగాల నుంచి కాపాడే వ్యాధి నిరోధకతను పెంపొందించే పోషకాలు గుడ్డులో దండిగా ఉంటాయి
TV9 Telugu
గుడ్డు పచ్చ సొనలోని లూటిన్, జియాంగ్జంతిన్ యాంటి ఆక్సిడెంట్లు కంటి రెటీనా ఆరోగ్యంగా ఉండేందుకు, వయసుతో వచ్చే కంటి సమస్యలను నివారించేందుకు ఎంతో ఉపయోగపడతాయి
TV9 Telugu
ముఖ్యంగా అమ్మాయిలకు వచ్చే పీరియడ్ సమస్యలకు గుడ్డుతో చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్డు పచ్చసొనలోని కొలిన్, విటమిన్ బి12, ఫోలేట్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పీరియడ్స్ సమస్యలను సమర్ధవంతంగా నివారిస్తాయి
TV9 Telugu
గుడ్డులోని కొవ్వులు హార్మోన్ల సమతుల్యతకు దోహదపడతాయి. దీంతో పీరియడ్స్ సకాలంలో వచ్చేలా చేస్తాయి. పైగా కండరాలు బలపడేందుకు కూడా గుడ్డులోని పోషకాలు ఎంతో దోహదపడతాయి
TV9 Telugu
గుడ్డులోని క్యాల్షియం, ఫాస్పరస్, సెలీనియం లాంటి ఖనిజ లవణాలు శరీర జీవ క్రియలు సాధారణంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఇవి అమ్మాయిల్లో తరచూ కనిపించే ఎముకల బోలు సమస్యను నివారిస్తాయి
TV9 Telugu
అధిక బరువుతో బాధపడే వాళ్లు ఉదయం గుడ్డు తినడం వల్ల ఎక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకోవడన్ని అడ్డుకోవచ్చు. దీంతో శరీరంలోని కొవ్వు స్థాయిలు తగ్గుతాయి
TV9 Telugu
మానసిక ఆరోగ్యానికి కూడా గుడ్డు ఉపయోగపడుతుంది. ఒత్తిడి వల్ల కలిగే మతి మరుపు, మానసిక అనారోగ్యాలను తొలగించి మెదడు పనితీరు చురుగ్గా ఉండేలా ప్రేరేపిస్తుంది. అందుకే రోజుకో గుడ్డు తినడం అలవాటు చేసుకోవాలి