ఈ గింజలు నీళ్లలో నానబెట్టి రోజూ ఖాళీ కడుపుతో గ్లాసుడు తాగితే..
23 December 2025
TV9 Telugu
TV9 Telugu
వంటల్లో వాడే వివిధ రకాల దినుసుల్లో మెంతులు చాలా ముఖ్యమైనవి. కాసిన్ని వేయించి పొడి చేసి వంటల్లో వేస్తే ప్రత్యేక రుచి వస్తుంది. కొద్దిగా చేదు రుచితో ఉన్నా మెంతుల్లో అనేక ఔషధ గుణాలు దండిగా ఉంటాయి
TV9 Telugu
మెంతుల్లోని ఫైబర్, విటమిన్లతోపాటు ఐరన్, మెగ్నిషియం వంటి లవణాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. మెంతులను నేరుగా తీసుకోవచ్చు. వీటిని నానబెట్టిన మెంతి నీటిని కూడా తాగవచ్చు
TV9 Telugu
ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం మెంతి నీటిని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయట. మెంతుల్లోని అధిక ఫైబర్ వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి
TV9 Telugu
మెంతినీరు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. జీవక్రియ వేగం పెరుగుతుంది. దీంతో ఒంట్లో కొవ్వు నిల్వలు తగ్గుతాయి. శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. అతిగా తినేవారికి మెంతి నీళ్లు మంచి ఔషధం
TV9 Telugu
అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారికి మెంతినీళ్లు ఎంతో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా మెంతి గింజల నీళ్లు దోహదపడతాయి
TV9 Telugu
షుగర్ వ్యాధిగ్రస్తులు మెంతి నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు మెంతినీరు తాగిడం మంచిది
TV9 Telugu
ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఆర్థరైటిస్, ఉబ్బసం తగ్గించడంలో సహాయపడతాయి. ఈ నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
శరీరంలో హార్మోన్ల సమస్యలను తగ్గించడంలో కూడా మెంతి నీళ్లు సహాయపడతాయి. మెంతినీళ్లు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు నయమవుతాయి. జుట్టు రాలడాన్ని నివారించవచ్చు