విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని హోటల్లో ఎలుకలు నూడుల్స్ తింటున్న దృశ్యం వైరల్ అయ్యింది. కేవలం టిఫిన్స్, భోజనానికే అనుమతి ఉన్నా, ఫాస్ట్ ఫుడ్స్ అందిస్తున్నారని తెలిసింది. ఓ పీజీ విద్యార్థి చిత్రీకరించిన ఈ వీడియో ఆహార భద్రత, పరిశుభ్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.