ఆసిఫాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడంతో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం 9 గంటలైనా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వాహనదారులు ఫ్లడ్లైట్లు వాడుతున్నారు. చలికి వణికిపోతున్న జనం చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.