AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మొబైల్ వెలుతురులో మహిళకు ప్రసవం.. త‌ల్లీ బిడ్డ క్షేమం.. 108 సిబ్బందిపై ప్రశంసలు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో అనుహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. మొబైల్, క్యాండిల్స్ వెలుగులో ఓ గర్భిణికి ప్రసవం చేశారు. పురిటినొప్పులు ఎక్కువైన ఓ గర్భిణికి మారుమూల ప్రాంతంలో సెల్‌ఫోన్ వెలుతురులోనే 108 సిబ్బంది ప్రసవం చేశారు. మహిళ ప్రసవ సమయంలో ఒక్కసారిగా కరెంటు కోత పడడంతో ఇలా గర్భిణికి డెలివరీ చేశారు. పాల్వంచ మండలంలోని గొత్తికోయపల్లె సీతారామపురం పూర్తిగా మారుమూల పల్లె. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన ఆడవి. కనీసం రోడ్డు కూడా సరిగా […]

Telangana: మొబైల్ వెలుతురులో మహిళకు ప్రసవం.. త‌ల్లీ బిడ్డ క్షేమం.. 108 సిబ్బందిపై ప్రశంసలు!
Pregnant Delivery
N Narayana Rao
| Edited By: |

Updated on: Apr 07, 2024 | 11:58 AM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో అనుహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. మొబైల్, క్యాండిల్స్ వెలుగులో ఓ గర్భిణికి ప్రసవం చేశారు. పురిటినొప్పులు ఎక్కువైన ఓ గర్భిణికి మారుమూల ప్రాంతంలో సెల్‌ఫోన్ వెలుతురులోనే 108 సిబ్బంది ప్రసవం చేశారు. మహిళ ప్రసవ సమయంలో ఒక్కసారిగా కరెంటు కోత పడడంతో ఇలా గర్భిణికి డెలివరీ చేశారు.

పాల్వంచ మండలంలోని గొత్తికోయపల్లె సీతారామపురం పూర్తిగా మారుమూల పల్లె. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన ఆడవి. కనీసం రోడ్డు కూడా సరిగా లేని ప్రాంతం. ఆర్ అండ్ బీ రోడ్డు వరకు చేరాలంటే ఐదారు కిలో మీటర్ల దూరం. ఇలాంటి పల్లెటూరు సీతారామపురం గ్రామానికి చెందిన మడవి ఇడిమమ్మ నిండు గర్భిణి. ఆదివారం ఏఫ్రిల్ 4వ తేదీ తెల్లవా రుజామున 3 గంటలు సమయంలో పురిటినొ ప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు 108కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన లక్ష్మీదేవిపల్లిలోని 108 సిబ్బంది ఉపేందర్, ఈఎంటీ గుగులోత్ రాధ వెంటనే గ్రామానికి చేరుకున్నారు.

ఇంతలో ఊరి శివారులోని వాగు వద్ద సాంకేతిక కారణాలతో 108 వాహనం నిలిచిపోయింది. దీంతో స్థానికుడి సాయంతో సెల్‌ఫోన్ టార్చిలైట్ల సాయంతో కాలినడకన గర్భిణి ఇంటికి చేరుకున్నారు 108 సిబ్బంది. ఆ ఊళ్లో కనీసం కరెంట్ లేదు. మరోవైపు ఇడిమమ్మకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో గర్భిణిని 108 వాహనం వరకు తరలించేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అప్పటికే పురిటి బిడ్డ తల కొంచెం బయటకు రావడంతో ముందుకు తీసుకెళ్లడం ప్రమాదకరమని భావించిన 108 సిబ్బంది.. ఊరిలోనే కాన్పు చేసేందుకు సిద్ధమయ్యారు. వెంటనే ఏరియా డాక్టర్ గోపీచంద్‌ను సెల్‌ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు.

సెల్‌ఫోన్ ద్వారా డాక్టర్ సలహాలు, సూచనలతో ఫోన్ టార్చ్ వెలుతురులోనే సురక్షిత కాన్పు చేసింది 108 సిబ్బంది. దీంతో రెండు కిలోలకు పైగా బరువున్న పండంటి మగబిడ్డ జన్మించాడు. అనంతరం ప్రాథమిక చికిత్స అందించి, తెల్లారిన తర్వాత తల్లీబిడ్డలను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సిగ్నల్ సైతం సరిగాలేని పరిస్థితుల్లో ఊరి బయటకు వచ్చి, వైద్యుడి సలహాలు తీసుకుని అత్యవసర సేవ లందించిన 108 సిబ్బందిని గ్రామస్తులు, వైద్యాధికారులు అభినందించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..