Morning Habits: సులువుగా బరువు తగ్గాలా? ఐతే ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి..
నేటి కాలంలో అనారోగ్యకరమైన ఆహారం, నిశ్చల జీవనశైలి కారణంగా బరువు పెరగడం సర్వసాధారణమైపోయింది. దీంతో బరువు తగ్గడం, ఫిట్‌గా, స్లిమ్‌గా మారడం చాలా మందికి సవాలుగా మారింది. అయితే ఇవన్నీ ప్రయత్నించినప్పటికీ బరువు తగ్గడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు. ఇదేవిధంగా మీరు కూడా బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు..

నేటి కాలంలో అనారోగ్యకరమైన ఆహారం, నిశ్చల జీవనశైలి కారణంగా బరువు పెరగడం సర్వసాధారణమైపోయింది. దీంతో బరువు తగ్గడం, ఫిట్‌గా, స్లిమ్‌గా మారడం చాలా మందికి సవాలుగా మారింది. అయితే ఇవన్నీ ప్రయత్నించినప్పటికీ బరువు తగ్గడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు. ఇదేవిధంగా మీరు కూడా బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే మీ ఉదయం దినచర్యలో ఈ కింది కొన్ని అలవాట్లను అలవాటు చేసుకుంటే చాలు.. సులువుగా బరువు తగ్గిపోతారు. బరువు తగ్గడానికి ఉదయం పూట ఏమేమి చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
బరువు తగ్గాలంటే ఉదయాన్నే ఈ నాలుగు పనులు చేయండి..
గోరువెచ్చని నీళ్లు తాగండి
ఉదయం నిద్రలేచిన వెంటనే ఒకటి నుంచి రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఈ అలవాటు శరీర జీవక్రియను సక్రియం చేస్తుంది. నిర్జలీకరణాన్ని తొలగిస్తుంది. గోరువెచ్చని నీళ్లు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. నీటిలో నిమ్మరసం, తేనె, చిన్న అల్లం ముక్కను కూడా జోడించవచ్చు. ఇది కొవ్వును కరగతీసే ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.
ఎండలో కొంత సమయం గడపండి
విటమిన్ డి పొందడానికి ఉదయం ఎండలో కొంత సమయం గడపడం చాలా అవసరం. అంతేకాకుండా కనీసం 15-20 నిమిషాలు ఎండలో గడపడం వల్ల శరీర సిర్కాడియన్ లయను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియ, ఆకలిని నియంత్రించే హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. ఇది రోజంతా శక్తి స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. అనారోగ్యకరమైన ఆహారాల తినాలనే కోరికలను తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది.
ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం
ఉదయం అల్పాహారం రోజులో అతి ముఖ్యమైన భోజనం. ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ ఎక్కువసేపు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రోజంతా అనారోగ్యకరమైన చిరుతిండిని తగ్గిస్తుంది. గుడ్లు, పెరుగు, జున్ను, చిక్కుళ్ళు వంటి ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. జీవక్రియ పెరుగుతుంది.
కనీసం 20-30 నిమిషాలు వ్యాయామం చేయాలి
ఉదయం వ్యాయామం చేయడం వల్ల శరీర జీవక్రియ పెరుగుతుంది. జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, సూర్య నమస్కారం, కపలాభతి ప్రాణాయామం వంటి తేలికపాటి యోగాసనాలు, కార్డియో వ్యాయామాలు కొవ్వును కరిగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అలాగే ఈ ఉదయం అలవాట్లు మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.




