AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Pragathi: వేణుస్వామి పూజల ఫలితంగానే మెడల్స్ వచ్చాయా? నటి ప్రగతి రియాక్షన్ ఏంటంటే?

తన పూజల ఫలితంగానే సినీ నటి ప్రగతి పవర్‌ లిఫ్టింగ్‌లో నాలుగు మెడల్స్‌ సాధించిందని ఇటీవల ప్రముఖ జోతిష్కుడు వేణుస్వామి చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట బాగా వైరలయ్యింది. తాజాగా ఇదే విషయంపై నటి ప్రగతినే స్వయంగా స్పందించింది.

Actress Pragathi: వేణుస్వామి పూజల ఫలితంగానే మెడల్స్ వచ్చాయా? నటి ప్రగతి రియాక్షన్ ఏంటంటే?
Venu Swamy, Pragathi
Basha Shek
|

Updated on: Dec 23, 2025 | 8:08 PM

Share

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ఇటీవల పవర్ లిఫ్టింగ్‌లో నాలుగు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. టర్కీ వేదికగా జరిగిన షియన్ ఛాంపియన్‌షిప్‌ టోర్నమెంట్ లో పాల్గొన్న ఆమె ఒక బంగారు పతకంతో పాటు మూడు సిల్వర్ మెడల్స్ గెల్చుకుంది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, సినీ అభిమానులు ప్రగతిని ప్రశంసల్లో ముంచెత్తారు. అయితే ఇదే తరుణంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ప్రగతి కష్టపడి సాధించి విజయాన్నితన ఖాతాలోకి వేసుకున్నారు. ‘ప్రగతి సినిమా కెరీర్‌తో పాటు రెజ్లింగ్‌లోనూ ఎదగాలని నా దగ్గరకు వచ్చి పూజ చేయించుకుంది. ఆ పూజల ఫలితంగానే నాలుగు పతకాలు సాధించిందని’ వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట బాగా వైరలయ్యింది. తాజాగా ఇదే విషయంపై నటి ప్రగతి స్వయంగా స్పందించింది. వేణు స్వామితో పూజల విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

‘సుమారు రెండున్నరేళ్ల ముందు నేను చాలా లో పాయింట్‌లో ఉన్నాను. దీంతో నా ఫ్రెండ్స్ రెఫర్ చేయడంతో నేను వేణుస్వామి వద్దకు వెళ్లాను. నాకే కాదు మన పరిస్థితులు బాగో లేనప్పుడు అలాంటి పూజలు చేయించకోవాలన్న ఆలోచన చాలా మందికి వస్తుంది. స్వామి ఏదో పూజ చేశారు.. కానీ నాకు పెద్దగా ఫలితమేమీ కనిపించలేదు. ఈ పూజల వల్ల మంచి ఫలితాలు వచ్చాయని మాత్రం నాకేమీ అనిపించడం లేదు. కానీ ఏడాది క్రితం జరిగిన పూజల ఫొటోలను మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ వైరల్ చేస్తున్నారు. వాటి గురించి నేను ఏం మాట్లాడగలను? ప్రగతి మెడల్స్‌ సాధించడానికి నేనే కారణమని అంటూ వేణుస్వామి చేస్తున్న కామెంట్లను ఆయన సంస్కారానికే వదిలేస్తున్నా. మన టైమ్‌ బాగోలేకపోతే ఇటువంటి జ్యోతిష్యాలనే కాకుండా అన్నింటినీ నమ్ముతాం’ అని ప్రగతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తన కష్టాన్ని వేణుస్వామి తన ఖాతాలో వేసుకున్నారని ఇన్ డైరెక్టుగా ఆయనకు కౌంటరిచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

పవర్ లిఫ్టింగ్ మెడల్స్ తో నటి ప్రగతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేణుస్వామి పూజల ఫలితంగానే మెడల్స్ వచ్చాయా? ప్రగతి రియాక్షన్ ఇదే
వేణుస్వామి పూజల ఫలితంగానే మెడల్స్ వచ్చాయా? ప్రగతి రియాక్షన్ ఇదే
నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై పల్లె వెలుగులోనూ ఈవీ ఏసీ బస్సులు
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై పల్లె వెలుగులోనూ ఈవీ ఏసీ బస్సులు
గంభీర్ ఎఫెక్ట్‌తో పాన్‌వాలా కొడుకు కెరీర్‌ క్లోజ్..
గంభీర్ ఎఫెక్ట్‌తో పాన్‌వాలా కొడుకు కెరీర్‌ క్లోజ్..
ఐదు జిల్లాల్లో యూరియా యాప్‌ అమలు విజయవంతం
ఐదు జిల్లాల్లో యూరియా యాప్‌ అమలు విజయవంతం
తండ్రిని కిరాతకంగా కొట్టి చంపిన కొడుకు
తండ్రిని కిరాతకంగా కొట్టి చంపిన కొడుకు
ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు!
ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు!
ప్రమాదకర రసాయనాలతో చిక్కీ తయారీ.. వీడియో చూస్తే జన్మలో ముట్టుకోరు
ప్రమాదకర రసాయనాలతో చిక్కీ తయారీ.. వీడియో చూస్తే జన్మలో ముట్టుకోరు
అరటి పండు తింటే బ్లడ్‌ షుగర్ లెవల్స్ పెరుగుతాయా? నిపుణులు చెప్పేద
అరటి పండు తింటే బ్లడ్‌ షుగర్ లెవల్స్ పెరుగుతాయా? నిపుణులు చెప్పేద
ప్రపంచంలో ఖరీదైన నీరు.. అక్కడ రూ.9వేలకు బాటిల్..కారణం తెలిస్తే..
ప్రపంచంలో ఖరీదైన నీరు.. అక్కడ రూ.9వేలకు బాటిల్..కారణం తెలిస్తే..