అరటి పండు తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
అరటిపండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు సురక్షితమేనా అనే సందేహం ఉంటుంది. ఇందులో ఫైబర్, పోషకాలు ఉన్నప్పటికీ, సహజ చక్కెర స్థాయిలు, గ్లైసిమిక్ ఇండెక్స్ రక్తంలో గ్లూకోజ్‌పై ప్రభావం చూపుతాయి. చిన్న పరిమాణంలో, సరైన పండును ఎంచుకొని, వైద్య నిపుణుల సలహాతో మధుమేహులు అరటిపండు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఇది అవశ్యం.

అరటిపండు దాదాపు అందరూ ఇష్టపడే పండు. ఇది పోషకాల నిధి కూడా. ఇందులో విటమిన్లు, పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే, అరటి పండు తీపి కారణంగా డయాబెటిక్ రోగులకు సమస్యగా మారుతుందని అంటారు. అరటిపండులో ఉండే చక్కెర కారణంగా డయాబెటిక్ రోగులు దీనిని తినకూడదని చాలా మంది నమ్ముతారు. అయితే, కొంతమంది దాని ప్రయోజనాలను ఉదహరిస్తూ డయాబెటిస్‌కు ఇది ప్రయోజనకరంగా భావిస్తారు. కాబట్టి డయాబెటిక్ రోగులు అరటిపండు తినవచ్చా లేదా ..? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..
అరటిపండు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో నేచురల్ షుగర్స్ ఉండటం వలన రీఫైన్డ్ షుగర్స్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. అరటి పండులో కార్బొహైడ్రేట్స్ సమృద్దిగా ఉండటం వలన సులభంగా జీర్ణమవుతుంది. అరటి పండు తినడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. దీని వలన బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు అరటి పండు తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం ఉంటుంది.
అరటి పండులో ఫైబర్ కంటెంట్, ప్రత్యేకించి కరిగే ఫైబర్ ఉండటం వలన జీర్ణక్రియ, చక్కెర శోషణ నెమ్మదిగా జరుగుతుంది. పండిన అరటి పండులో గ్లైసిమిక్ ఇండెక్స్ లెవల్స్ సమృద్దిగా ఉంటాయి. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం ఉంటుంది. అరటి పండులో ఫైబర్ కంటెంట్, విటమిన్లు, మినరల్స్ సమృద్దిగా ఉంటాయి.
కానీ, అరటిపండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫైబర్ ఆహారం నెమ్మదిగా జీర్ణం కావడానికి, రక్తంలో చక్కెరలో ఆకస్మిక హెచ్చుతగ్గులను నివారిస్తుంది. అరటిపండ్లు పొటాషియం అద్భుతమైన మూలం. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు..అరటిపండ్లలో విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
అందుకే, మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు ఒక చిన్న లేదా మధ్య తరహా అరటిపండు తినడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇది వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయిలు, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా అరటిపండ్లు తినవచ్చు, కానీ గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. మీ ఆహారంలో అరటిపండ్లను చేర్చుకునే ముందు మీ వైద్యుడిని లేదా డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




