Viral Video: పిలవని పేరంటానికి అనుకోని అతిథి..! పెళ్లి జరుగుతుండగా అమాంతం పెళ్లి కూతురిపై దూకి…
మండపంలో కన్యాదానం జరుగుతోంది. అంతలోనే అనుకోని అతిథి ఒకరు అమాంతంగా నవ వధువుపైకి దూకి రంగప్రవేశం చేశారు..దాంతో ఆ పక్కనే ఉన్న వరుడు, పురోహితుడు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ ఊహించని అతిథి ఎవరో కాదు.. హనుమంతుడిగా భావించే కోతి. అవును, పెళ్లి మండపం సాక్షిగా ఒక కోతి వధువుపైకి దూకింది. తరువాత ఏం జరిగిందో వీడియోలో చూడాల్సిందే..

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఒక జంట వివాహం జరుగుతోంది. పెళ్లి తంతూ మధ్యలో ఉండగా, అకస్మాత్తుగా వేడుకలోకి ఒక కోతి ప్రవేశించడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. నది ఒడ్డున జరిగిన వివాహంలో పురోహితుడు వేద మంత్రాలు పఠిస్తుండగా, ఈ అసాధారణ అతిథి ప్రవేశించడం అక్కడి వారందరిలో ఆందోళన, గందరగోళ వాతావరణంగా మార్చింది. సోషల్ మీడియాలో ఈ వైరల్ వీడియో చూసిన ప్రజలు దీనిని కేవలం ఒక చిలిపిగా కాకుండా హనుమంతుడి ఆశీర్వాదంగా భావిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన ఈ వీడియోలో వధూవరులు నది ఒడ్డున కూర్చుని వివాహ ఆచారాలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత కెమెరా కట్ చేస్తే ఒక కోతి పెళ్లి మండపంలోకి దూకింది..అక్కడ ఉన్న అరటిపండును తీసుకుని వెళ్లిపోయింది. అంతేగానీ, ఆ కోతి ఎలాంటి అల్లరి చేయలేదు. ఎవరినీ ఇబ్బంది పెట్టదు. తను కూడా ఆ పెళ్లిలో భాగమైనట్లుగా రిలాక్స్‌గా తిరుగుతుంది. చుట్టు పక్కల ఇంకా అనేక కోతులు ఉన్నాయి. పెళ్లి కోసం ఉంచిన పండ్లు ఎత్తుకెళ్లి నది ఒడ్డున కూర్చుని ఆహారాన్ని ఆస్వాదిస్తున్నాయి. వధూవరులు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కానీ, వారు ఏ మాత్రం ఆందోళన, బెరుకు లేకుండా ముఖాల్లో చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మొత్తం సంఘటన వీరి వివాహాన్ని మరింత ప్రత్యేకంగా చేసింది.
View this post on Instagram
ఈ వీడియోను @mini._.camera అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను 8.2 మిలియన్లకు పైగా వీక్షించారు. 300,000 మందికి పైగా లైక్ చేశారు. వీడియో వైరల్ అయిన వెంటనే, సోషల్ మీడియా స్పందనలతో నిండిపోయింది. చాలా మంది యూజర్లు దీనిని మంచి సంకేతంగా అభివర్ణించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




