బరువును ఇట్టే తగ్గించే పవర్‌ఫుల్ దివ్యౌషధం.. టీకి బదులు ఇది తాగితే దెబ్బకు స్లిమ్ అవ్వాల్సిందే
ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు జిమ్‌కు వెళ్లడం లేదా కఠినమైన ఆహారం పాటించడం ద్వారా మాత్రమే బరువు తగ్గగలమని భావిస్తారు. అయితే, వారి జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు..

ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు జిమ్‌కు వెళ్లడం లేదా కఠినమైన ఆహారం పాటించడం ద్వారా మాత్రమే బరువు తగ్గగలమని భావిస్తారు. అయితే, వారి జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అదేంటో కాదు.. ఉదయం కాఫీ లేదా టీలకు బదులుగా ఈ నీరు తాగడం.. డైలీ జీలకర్ర నీరు తాగితే.. బరువు తగ్గి పొట్ట ఫ్లాట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
జీలకర్ర నీరు తాగితే.. తక్కువ కాలంలోనే ఎక్కువ మార్పు కనిపిస్తుంది. దీనిని మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మీరు కొవ్వును కరిగించడం ప్రారంభించవచ్చు.. బరువు పెరగడాన్ని నియంత్రించవచ్చు. జీలకర్ర నీరు త్రాగడం ద్వారా బరువు తగ్గడం ఎలా.. జీలకర్ర నీటిని ఎలా తయారు చేయాలి..? ఈ వివరాలను తెలుసుకుందాం..
బరువు తగ్గడానికి.. జీలకర్ర నీరు త్రాగడానికి ఉత్తమ, అత్యంత ప్రభావవంతమైన సమయం ఉదయం. ఒక టీస్పూన్ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం, ఈ నీటిని నానబెట్టిన జీలకర్రతో తేలికగా వేడి చేసి, వడకట్టి ఖాళీ కడుపుతో త్రాగాలి. ఆ నీటితోపాటు.. జీలకర్రను కూడా నమిలి తినవచ్చు..
జీలకర్ర నీరు తాగిన తర్వాత గంటసేపు వేరే ఏమీ తినకూడదు లేదా త్రాగకూడదు. మీరు జీలకర్ర నీటిని ఇలా తాగితే, అది బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. జీలకర్ర నీరు తాగడంతో పాటు, మీరు రోజుకు అరగంట నుండి గంట వరకు నడవాలని గుర్తుంచుకోండి. ఇది జీలకర్ర నీటి ప్రభావాన్ని పెంచుతుంది.
ఇంకా రాత్రిపూట కూడా జీలకర్ర నీటిని కూడా తాగవచ్చు. రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ జీలకర్రను మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. జీలకర్ర నీరు తాగిన తర్వాత వేరే ఏమీ తినకూడదని గుర్తుంచుకోండి. రాత్రి భోజనం తర్వాత జీలకర్ర నీరు తాగాలి. రాత్రి భోజనం తర్వాత అరగంట తర్వాత మీరు జీలకర్ర నీరు తాగవచ్చు.
జీలకర్ర నీరు తక్కువ కేలరీల పానీయం. జీలకర్రలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది విటమిన్లు ఎ, సి, రాగి, మాంగనీస్ కు మంచి మూలం. శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్న జీలకర్ర ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. ఇంకా కొవ్వును కాల్చడం ప్రారంభిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




