AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలం హెల్త్ కోసం గోల్డెన్ టిప్.. ఇలా తయారు చేసిన పాలు తాగితే.. బంపర్‌ బెనిఫిట్స్..

చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా వేడివేడిగా మసాలా ఫుడ్స్ తినడం అంటే దాదాపుగా అందరూ ఇష్టపడుతుంటారు. టైమ్‌ దొరికితే చాలు.. వెచ్చగా కప్పుకుని హాయిగా పడుకుంటారు..ఇంతవరకు బాగానే ఉన్నా శీతాకాలంలో సీజనల్ వ్యాధులు దాడి చేసే అవకాశం ఎక్కువుంటుంది. అందుకే ఈ సీజన్ లో ఆహారంలో తగిన జాగ్రత్తలు అవసరం అంటున్నారు నిపుణులు. చల్లటి వాతావరణంలో రోగాలను దరిచేరకుండా ఉండేందుకు గోల్డెన్ మిల్క్ రోజు ఒక గ్లాసు తాగితే హెల్త్ కు ఎంతో మంచిదని చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

చలికాలం హెల్త్ కోసం గోల్డెన్ టిప్.. ఇలా తయారు చేసిన పాలు తాగితే.. బంపర్‌ బెనిఫిట్స్..
golden milk
Jyothi Gadda
|

Updated on: Dec 23, 2025 | 7:40 PM

Share

శీతాకాలంలో చల్లదనానికి శరీరం వేడిని త్వరగా కోల్పోతుంది. గోల్డెన్ మిల్క్(పసుపు పాలు) తాగడం వల్ల లోపలి నుండి వేడి పుట్టి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వణుకు పుట్టించే చలిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఈ సీజన్‌లో తరచూగా వచ్చే జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలను తగ్గించడానికి పసుపులోని కర్కుమిన్ ఉపయోగపడ్తుంది. ఫ్లూ వంటి జ్వరాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది యాంటీవైరల్ కవచంలా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ​చలి తీవ్రత పెరిగినప్పుడు కీళ్ల నొప్పులు, వాతం ఎక్కువవుతాయి. పసుపులోని శక్తివంతమైన యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కండరాలు పట్టెయ్యకుండా సహాయపడుతుంది. కీళ్ల వాపును తగ్గించి, నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడింది.​

చలిగాలి వల్ల చర్మం పొడిబారి ఇర్రిటేటింగ్ గా ఉంటుంది. పసుపు పాలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు, పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని లోపలి రిపేర్ చేసి తేమను కాపాడతాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. చలి ఎక్కువుంటే నిద్ర సరిగా పట్టదు. రాత్రి పడుకునే ముందు ఈ గోల్డ్ మిల్క్ ఒక్క గ్లాసు తాగితే, పాలలోని ట్రిప్టోఫాన్ అనే సహజమైన అమైనో యాసిడ్ మెదడును రిలాక్స్ చేస్తుంది. పసుపు శరీరం లో నొప్పులను తగ్గించి ఘాఢమైన నిద్రకు సహాయపడుతుంది.

గోల్డెన్ మిల్క్‌ ​తయారీ విధానం​:

ఇవి కూడా చదవండి

ఒక పావు లీటర్ పాలలో అర టీ స్పూన్ పసుపు పొడి, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా మరిగించండి. స్టవ్ మీద నుండి దించి పొడిగా చేసిన బెల్లాన్ని స్పూన్ తో కలపండి. తేనె కూడా వాడవచ్చు. ఇదే గోల్డెన్ మిల్క్…హ్యాపీ గా వేడి వేడిగా తాగేయ్యండి.

​ఎప్పుడు తాగితే బెస్ట్?​:

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కు ముందు లేదా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోల్డెన్ మిల్క్ వేడి వేడిగా తాగండి.. ఇలా రోజూ తాగితే ఈ సీజన్లో రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..