ముస్లిం దేశంలో బయటపడ్డ 4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం..ఎక్కడంటే..
ఒక ముస్లిం దేశంలో సుమారు 4500 సంవత్సరాల పురాతన సూర్య దేవాలయం వెలుగులోకి వచ్చింది. ఇది శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది.ఇప్పటివరకు పిరమిడ్‌లు, సమాధుల నాగరికతను కలిగి ఉన్న ఈజిప్టులో జరిపిన తవ్వకాలు, చరిత్ర గురించి మన ఆలోచనా విధానాన్ని మార్చివేస్తున్నాయి. కైరో సమీపంలో గుర్తించబడిన 4,500 సంవత్సరాల పురాతన సూర్య దేవుడి రాతి ఆలయం.. పురాతన ఈజిప్ట్ మరణాలు మాత్రమే కాకుండా సూర్యుడిని, శక్తిని, విశ్వాన్ని ఆరాధించే సంస్కృతి అని వెల్లడిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈజిప్టు రాజధాని కైరో సమీపంలోని ఒక పురావస్తు పరిశోధన ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు, శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు సూర్య భగవానుడికి సంబంధించిన 4,500 సంవత్సరాల పురాతన ఆలయాన్ని కనుగొన్నారు. ఐదవ రాజవంశానికి చెందిన ఫారో కింగ్ న్యూసెర్రే ఆలయంపై పనిచేస్తున్న ఇటలీ, పోలాండ్‌కు చెందిన ఉమ్మడి పురావస్తు మిషన్ ద్వారా ఈ ఆవిష్కరణ జరిగింది. ఇప్పటివరకు ఈజిప్ట్ అంటే పిరమిడ్లు, మమ్మీలు, సమాధులకు ప్రసిద్ధి చెందింది. కానీ, ఈ సూర్య దేవాలయం బయటపడటంతో పురాతన ఈజిప్టులో జీవితం, శక్తి, ఖగోళ శక్తుల ప్రాముఖ్యత ఎంత లోతుగా ఉందో చూపిస్తుంది.
ప్రాచీన ఈజిప్టులో సూర్య ఆరాధన, రాచరిక శక్తి..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఆలయం ఐదవ ఈజిప్ట్ రాజ్యం (2465–2323 BC) నాటిది. దీనిని సుమారు 2420 నుండి 2389 BC వరకు పాలించిన ఫారో న్యూసెర్రే ఇని నిర్మించాడని తెలుస్తోంది.. ఆ కాలంలో సూర్య దేవుడు రా విశ్వ సృష్టికర్తగా పరిగణించబడ్డాడు. ఫారోలు తమను తాము అతని ప్రతినిధులుగా భావించారు. అందుకే సూర్య దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు. శక్తి చట్టబద్ధతకు చిహ్నాలు కూడా. ఈ ఆవిష్కరణ రాజకీయాలు, మతం, దేవుళ్ళతో ముడిపడి ఉన్నారనే దానికి ఆధారాలను అందిస్తుంది.
దేవాలయం కాదు, ఖగోళ శాస్త్ర కేంద్రం..
తవ్వకాల సమయంలో ఆలయం లోపల రాతిపై చెక్కబడిన మతపరమైన క్యాలెండర్ కూడా కనుగొన్నారు. ఇది సోకార్, మిన్, రాతో సంబంధం ఉన్న పండుగలను ప్రస్తావిస్తుంది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆలయ పైకప్పును నక్షత్రాలు, గ్రహాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించారు. ఈ సూర్య దేవాలయం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు.. పురాతన ఈజిప్టులో ఖగోళ శాస్త్రానికి ప్రధాన కేంద్రంగా కూడా ఉందని ఇది స్పష్టంగా సూచిస్తుంది. దీని అర్థం ఈజిప్షియన్లు ఆకాశం, సమయం, వాతావరణం గురించి కూడా అవగాహన కలిగి ఉన్నారు.
10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతమైన నిర్మాణం…
ఈ ఆలయం దాదాపు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దాని వైభవం తెల్లని సున్నపురాయి చెక్కడాలు, గ్రానైట్ స్తంభాలు, పొడవైన కారిడార్లు, పైకప్పుకు దారితీసే మెట్లలో స్పష్టంగా కనిపిస్తుంది. తవ్వకాలలో నైలు నదికి లేదా దాని శాఖలలో ఒకదానికి అనుసంధానించబడినట్లుగా తెలిసేలా వాలు కూడా బయటపడింది. యాత్రికులు పడవ ద్వారా ఇక్కడకు వచ్చి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. పురాతన ఈజిప్షియన్ల సెనెట్క కుండలు, బీర్ గ్లాసులు, చెక్క ముక్కలు కూడా ఆలయం వద్ద కనుగొనబడ్డాయి. ఇది వారి సామాజిక కార్యకలాపాలను సూచిస్తుంది.
పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం.. పురాతన వస్తువులు ఐదవ రాజవంశానికి చెందిన ఆరవ ఫారో తన కోసం ఒక కొత్త ఆలయాన్ని నిర్మించుకోవడానికి ఆలయంలోని కొన్ని భాగాలను కూల్చివేసాడు. ఆలయం కింద మరొక మట్టి ఇటుక భవనం కనుగొనబడింది. ఇది ఈ ప్రదేశం అనేక దశల ద్వారా పరిణామం చెందిందని సూచిస్తుంది. ఈ ఆవిష్కరణ పురాతన ఈజిప్షియన్ చరిత్ర కేవలం స్థిరంగా లేదని, నిరంతరం మారుతూ, అభివృద్ధి చెందుతూ ఉందని రుజువు చేస్తుంది.
ఈజిప్టులో సూర్య దేవుడు రా ఆలయం ఆవిష్కరణ
4,500 సంవత్సరాల పురాతనమైన ఈ సూర్యదేవాలయం ఈజిప్ట్ కేవలం సమాధుల నాగరికత అనే భావనను సవాలు చేస్తుంది. ఈ ఆవిష్కరణ పురాతన ఈజిప్ట్ జీవితం, శక్తి, విజ్ఞానం, విశ్వం గురించి లోతైన అవగాహన కలిగిన అత్యంత అభివృద్ధి చెందిన సంస్కృతి అని వెల్లడిస్తుంది. భవిష్యత్ తవ్వకాలు సూర్యారాధన, ఈజిప్షియన్ శక్తికి సంబంధించిన మరిన్ని రహస్యాలను వెల్లడిస్తాయి.




